Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ బెర్తు ఖరారు: సంచలన ప్రకటన చేసిన క్రిస్ గేల్

 Chris Gayle Has A Special Message After Two-Time Champions West Indies Qualify For ICC World Cup 2019

హైదరాబాద్: రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా, ప్రపంచంలోనే మేటి జట్టుగా వెలుగొందిన వెస్టిండిస్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. ఇటీవల కాలంలో తన పేలవమైన ఆటతీరుతో వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఫలితంగా జింబాబ్వే వేదికగా జరుగుతోన్న వరల్డ్ కప్ క్వాలిఫయిర్ మ్యాచ్‌లు ఆడుతోంది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఈ క్వాలిఫయిర్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి... చివరకు ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. సూపర్ సిక్స్‌లో భాగంగా బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

స్కాట్లాండ్‌పై విజయం సాధించిన వెంటనే వెస్టిండిస్ క్రిస్ గేల్ అభిమానుల కోసం ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశాడు. 'మిషన్ పూర్తయింది' అంటూ అభిమానులకు గేల్ చెప్పినట్లు వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. గేల్ మాట్లాడుతూ వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగి చివరికి డక్‌వర్త్ లూయిస్ విధానంలో విజయం సాధించామని, అయితే ఏదైనా విజయం విజయమేనని పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. ప్రస్తుత జట్టు యువకులతో బలంగా ఉందన్న గేల్ ఇదే తనకు చివరి వరల్డ్ కప్ అంటూ సంచలన ప్రకటన చేశాడు.

Story first published: Thursday, March 22, 2018, 16:34 [IST]
Other articles published on Mar 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+