బెంగుళూరు: స్టేడియం లోపల బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించే క్రిస్ గేల్ కుదురుగా కూర్చుని కూతురుకు పాలు పట్టాడు. సోషల్ మీడియా వెబ్‌సైట్ 'ఇన్‌స్టాగ్రాం'లో క్రిస్ గేల్ ఉంచిన ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌లా మారింది. ఇటీవలే కొన్ని నెలల కిందట క్రిస్ గేల్ భార్య బెరిడ్జ్ ఓ పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
ఆ పాపకు 'బ్లష్' అని పేరు పెట్టుకున్న గేల్, బోసి నవ్వుల పాపను చూసి సంబరపడిపోతున్నాడు. తండ్రిగా మారిన తర్వాత గేల్‌లో పెద్ద మార్పే వచ్చినట్లే కనిపిస్తోంది. కుమార్తెతో కాలక్షేపం చేసేందుకు గేల్ ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యాడనే వార్తలు వచ్చాయి.
కాగా, ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో సేదతీరుతున్న క్రిస్ గేల్ తన చిన్నారి కూతురుకి పాలు పడుతున్నాడు. చిన్నారి బ్లష్‌కు పాలు పడతూ తీయించుకున్న ఫోటోను ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో షేర్ చేశాడు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 21 వేల మందికి చేరువై వైరల్‌గా మారింది.