న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా ముందు టవల్ విప్పి..: గేల్‌పై ఓ యువతి, మరో అసభ్య ప్రవర్తన

By Srinivas

మెల్బోర్న్: మహిళా టీవీ యాంకర్‌తో అనుచిత వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గేల్ గురించి మరో యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది ప్రపంచ కప్ సందర్భంగా సిడ్నీలో ట్రెయినింగ్ సెషన్‌లో గేల్ దారుణంగా తన ముందు ఎక్స్‌పోజ్ చేశాడని తెలిపింది.

ఆమె ఆస్ట్రేలియా మహిళ అని తెలుస్తోంది. నాడు జరిగిన విషయమై ఆమె మీడియాతో పంచుకుంది. ఆమె సిడ్నీలో వెస్టిండీస్‌తో కలిసి పని చేసింది.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం... పనిలో భాగంగా ఓ రోజు ఆమె డ్రెస్సింగ్ రూంకు వెళ్లింది. ఆమె ఉదయం నుంచి ఏమీ తినలేదు. దీంతో శాండ్ విచ్ తినేందుకు డ్రెస్సింగ్ రూంకు వెళ్లింది. ఆ సమయంలో వెస్టిండీస్ ప్లేయర్లు ఎవరూ కూడా గదిలో ఉండరని ఆమె భావించింది.

Chris Gayle exposed himself to me: woman

అందరు శిక్షణలో ఉంటారని భావించింది. అయితే, ఆమె డ్రెస్సింగ్ గదికి వెళ్లేసరికి క్రిస్ గేల్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఆ సమయంలో గేల్ తన నడుముకు టవల్ చుట్టుకొని మాత్రమే ఉన్నాడు.

ఆమె డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లగానే గేల్ తన టవల్‌ను కొంత విప్పి ఎక్స్‌పోజ్ చేశాడు. అంతేకాకుండా, నీవు దీని కోసమే ఎదురు చూస్తున్నావా? అని ప్రశ్నించాడు.

ఈ విషయం తెలిసిన వెస్టిండీస్ టీమ్ మేనేజర్ రిచీ రిచర్డ్‌సన్.. గేల్ పేరును ప్రస్తావించకుండా 'మహిళల పట్ల గౌరవంగా ఉండాల'ని హితవు పలికాడు. ఈ విషయమై అతను వెస్టిండీస్ ప్లేయర్లందరికీ మెయిల్ సందేశం పంపించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X