Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు: మహిళ

సిడ్నీ: ఇప్పటికే వివాదంలో చిక్కుకున్న వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు మరో షాక్ తగిలింది. గేల్ తనను లైంగికంగా వేధించాడని, తన వద్ద అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఆస్ట్రేలియా మహిళ వెల్లడించింది. 2015 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా వెస్టిండీస్ జట్టుతో కలిసి పనిచేస్తున్న తన పట్ల గేల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది.

శాండ్‌విచ్ తీసుకోవడానికి తాను జట్టు డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లానని, అక్కడ తనకు గేల్ ఎదురయ్యాడని, అతను టవల్ మాత్రమే కట్టుకుని ఉన్నాడని, వెంటనే టవల్ కూడా తీసేసి అభ్యంతరకరంగా మాట్లాడాడని, దాంతో తాను షాక్‌కు గురయ్యానని, వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశానని ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పింది.

Chris Gayle exposed himself to me: woman

అప్పటి తన అనుభవాన్ని ఆమె ఫెయిర్ ఫాక్స్ మీడియా సంస్థకు వివరించింది. ఈ సంఘటన గురించి తాను వెస్టిండీస్ జట్టు మేనేజర్, మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్సన్‌కు ఫిర్యాదు చేశానని, దాంతో మహిళా సిబ్బందితో ఆటగాళ్లు గౌరవప్రదంగా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేశారని, కానీ అందులో గేల్ పేరు ప్రస్తావించలేదని ఆమె అన్నారు.

క్రికెట్ ప్రెజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడి క్రికెటర్ క్రిస్ గేల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మహిళా ప్రెజెంటర్ అయిన మెల్ మెక్‌లాలిన్‌ను తాగడానికి తనతో పాటు వస్తావా అంటూ గేల్ ప్రత్యక్ష ప్రసారంలో అడిగి వివాదం సృష్టించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+