న్యూఢిల్లీ: సాకర్ దిగ్గజం క్రిష్టియానో రొనాల్డో తనకు తానే బెస్ట్ అనుకుంటాడని, తాను కూడా అంతేనని వెస్టిండీస్ క్రికెట్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ తన ఆటో బయోగ్రాప్‌లో పేర్కొన్నాడు. సాగర్ దిగ్గజాలు రొనాల్డో, ఇబ్రహిమోవాక్‌కు తాను ఏమాత్రం తీసిపోనని చెప్పాడు.
క్రిస్ గేల్ తన ఆత్మ కథ 'సిక్స్ మెషీన్'లో పలు అంశాలు పేర్కొన్నాడు. అందరూ రొనాల్డోనే గొప్ప అని అనరని, కొంతమంది మెస్సీ వైపు కూడా మొగ్గు చూపుతారని చెప్పాడు. రొనాల్డో మాత్రం తనకు తానే బెస్ట్ అని భావిస్తాడని, తాను కూడా అలాంటివాడినే అని చెప్పాడు.

రికార్డుల కోసం తాపత్రయపడనని, వాటంతట అవే వస్తాయని చెప్పాడు. అయితే, రికార్డుల కోసమే తాపత్రయపడేవారు లేకపోలేదన్నాడు. ఆ దిశగానే వారు ప్రయత్నాలు చేస్తారని చెప్పాడు. ఒత్తిడిలో కూడా ఒక క్రీడాకారుడిని రాణించేలా చేసేది ఆత్మవిశ్వాసం అన్నాడు. అంకితభావం, కష్టపడేతత్వంతో అది సాధ్యమవుతుందన్నాడు.