For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్, గేల్ ఒకే రోజు డబుల్ సెంచరీ... బంతులు కూడా సమానం

By Nageswara Rao

కాన్ బెర్రా: అంతర్జాతీయ క్రికెట్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఇద్దరూ ఒకే రోజు డబుల్ సెంచరీ ఫీట్‌ను సాధించారు. సచిన్, గేల్ ఇద్దరూ ఫిబ్రవరి 24న డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇంతవరకూ కాకతాళీయమే అనుకున్నా... వీరిద్దరూ ఆడిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న బంతులు కూడా సమానం (147) కావడం గమనార్హం.

2010లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టిన సచిన్ 200 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, మంగళవారం జింబాబ్వేతో కాన్ బెర్రాలో జరిగిన మ్యాచ్‌లో గేల్ 10 ఫోర్లు, 16 సిక్స్‌ల సాయంతో 215 పరుగుల చేసి అవుటయ్యాడు.

Chris Gayle double ton coincides with Sachin Tendulkar’s 200 in 2010

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేయగా, క్రిస్ గేల్ అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో వరల్డ్ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు.

1996లో జరిగిన వరల్డ్ కప్‌లో రావల్పిండిలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన గ్యారీ కిరెస్టన్ 188 పరుగుల రికార్డుని గేల్ అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ట్వంటీ20 మ్యాచ్‌ల్లో సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన ఏకైక ఆటగాడు క్రిస్ గేల్ మాత్రమే కావడం గమనార్హం.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+