Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

13 బంతులాడి డకౌట్: ప్రపంచకప్ చరిత్రలో గేల్ రెండోసారి

Chris Gayle departs for a 13-ball duck! An excellent start with the ball for Bangladesh

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా టాంటన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిసే గేల్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో గేల్‌ డకౌట్‌గా నిష్క్రమించాడు. 13 బంతులాడిన గేల్ కనీసం సింగిల్ కూడా తీయలేకపోయాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తన సహజ సిద్ధమైన భారీ షాట్లను వదిలిపెట్టి నిలకడగా ఆడేందుకు యత్నించిన గేల్‌ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో క్రిస్ గేల్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. వరల్డ్‌కప్‌లో చరిత్రలో క్రిస్ గేల్ డకౌట్ అయిన రెండు సార్లు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కావడం విశేషం.

బంగ్లాదేశ్‌తో 2003లో జరిగిన వరల్డ్ కప్‌లో కూడా గేల్ డకౌట్‌గానే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ను గేల్‌, ఎవిన్‌ లూయిస్‌లు ఆరంభించారు. ఈ క్రమంలోనే మొర్తాజా వేసిన తొలి ఓవర్‌ మెయిడిన్‌ అయ్యింది.

మొర్తాజా వేసిన తొలి ఓవర్‌ను ఆడేందుకు గేల్ ఇబ్బందిపడినట్లు కనిపించింది. ఆ తర్వాత రెండో ఓవర్‌లో గేల్‌ ఐదు బంతులాడినప్పటికీ కనీసం పరుగు కూడా చేయలేదు. దాంతో విండీస్‌ రెండు ఓవర్లు ముగిసే సరికి రెండు పరుగులు మాత్రమే చేసింది. ఇక, సైఫుద్దిన్ వేసిన నాలుగో ఓవర్‌లో క్రిస్ గేల్ వికెట్ కీపర్ రహీమ్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

1
43666

దీంతో వెస్టిండిస్ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి విండీస్ 114 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్(62), షెయ్ హోప్(44) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Story first published: Monday, June 17, 2019, 17:02 [IST]
Other articles published on Jun 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+