For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలక్షన్‌కు దూరం: గేల్ లేని విండిస్ జట్టుని టీ20ల్లో చూడగలమా?

Chris Gayle Declines Selection, West Indies Announce ODI And T20I Teams vs India
Chris Gayle declines selection, West Indies announce ODI and T20I teams vs India

హైదరాబాద్: టీమిండియా-వెస్టిండిస్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరిస్‌లు రసవత్తరంగా సాగుతాయి. టెస్టు క్రికెట్‌లో ఎలా ఉన్న పరిమిత ఓవర్లలో మాత్రం వెస్టిండిస్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తారు. భారీ సిక్సర్లు బాదడంతో పాటు అద్భుతమైన బంతులు వేయగలరు. మ్యాచ్‌ గమనాన్ని ఆఖరి ఓవర్లోనూ మార్చేగలరు.

ఇక, టీ20 క్రికెట్ విషయానికి వస్తే వెస్టిండిస్ ఆటగాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆనంతరం భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరిస్‌లో వీరిలో చాలా మందిని చూసే అవకాశం లేదు. భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టి 20ల సిరీస్‌లలో తలపడే వెస్టిండిస్‌ జట్లను సోమవారం బోర్డు ప్రకటించింది.

భారత్‌తో పరిమిత ఓవర్ల సిరిస్‌కు క్రిస్ గేల్ దూరం

భారత్‌తో పరిమిత ఓవర్ల సిరిస్‌కు క్రిస్ గేల్ దూరం

విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ వ్యక్తిగత కారణాలతో రెండు ఫార్మాట్లకు దూరం కాగా, ఆల్‌రౌండర్లు కీరన్‌ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్‌లు టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. విండీస్‌ తరఫున పొలార్డ్‌ 2017 సెప్టెంబర్‌లో చివరి టీ20 ఆడాడు. బ్రావో అయితే 2016 నవంబర్‌ నుంచి అసలు ఏ ఫార్మాట్‌లోనూ లేడు.

చాలా కాలం తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి బ్రావో

చాలా కాలం తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి బ్రావో

ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ డారెన్‌ బ్రావో చాలా కాలం తర్వాత టీ20 ఫార్మాట్‌తో పునరాగమనం చేస్తున్నాడు. దీంతో విండిస్ ‌వన్డే జట్టులో మనం కొన్ని కొత్త ముఖాలను చూడబోతున్నాం. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ చంద్రపాల్‌ హేమ్‌రాజ్, ఆల్‌రౌండర్లు ఫాబియాన్‌ అలెన్, షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్, పేసర్‌ ఒషేన్‌ థామస్, ఒబెద్‌ మెక్‌కాయ్, క్యారీ పియరీ కొత్తగా జట్టుకు ఎంపికయ్యారు.

 వన్డేలకు కెప్టెన్‌గా జాసన్ హోల్డర్

వన్డేలకు కెప్టెన్‌గా జాసన్ హోల్డర్

వన్డేలకు జాసన్‌ హోల్డర్ కెప్టెన్‌గా వ్యవహారిస్తోండగా, టీ20లకు కార్లొస్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యం వహించనున్నాడు. వన్డే సిరీస్‌కు ముందు వెస్టిండిస్ జట్టు గువహటిలో సన్నాహక శిబిరంలో పాల్గొంటుంది. విండిస్ జట్టు విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ బంగ్లాదేశ్‌తో సిరీస్‌కూ అందుబాటులో ఉండడని, అయితే, స్వదేశంలో ఇంగ్లాండ్‌ సిరీస్, 2019 వన్డే ప్రపంచ కప్‌ ఆడతాడని సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ కోట్నీ బ్రౌన్‌ తెలిపారు.

 వన్డే జట్టు:

వన్డే జట్టు:

వన్డే జట్టు:

జేసన్‌ హోల్డర్‌ (సారథి), ఫాబియన్‌ అలెన్‌, సునిల్‌ ఆంబ్రిస్‌, దేవంద్ర బిషూ, చందర్‌పాల్‌ హేమ్‌రాజ్‌, షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌, షై హోప్‌, అల్జరీ జోసెఫ్‌, ఇవిన్‌ లూయిస్‌, ఆష్లే నర్స్‌, కీమో పాల్‌, రోవ్‌మన్‌ పావెల్‌, కెమర్‌ రోచ్‌, మార్లోన్‌ శామ్యూల్స్‌, ఒషానె థామస్‌

టీ20 జట్టు:

కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (సారథి), ఫాబియన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, షిమ్రాన్‌ హెట్‌మెయిర్‌, ఇవిన్‌ లూయిస్‌, ఓబ్డ్‌ మెక్‌కోయ్‌, ఆష్లే నర్స్‌, కీమో పాల్‌, ఖారీ పెర్రీ, కీరన్‌ పొలార్డ్‌, రోవ్‌మన్‌ పావెల్‌, దినేశ్‌ రామ్‌దిన్‌, ఆండ్రూ రసెల్‌, షెర్ఫన్‌ రూథర్‌ఫర్ట్‌, ఒషానె థామస్‌.

Story first published: Tuesday, October 9, 2018, 13:36 [IST]
Other articles published on Oct 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+