For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో నేనే ‘GOAT’: క్రిస్‌ గేల్ సంచలన వ్యాఖ్యలు

By Nageshwara Rao
Chris Gayle calls himself the GOAT

హైదరాబాద్: ఎవరితోనూ తనని తాను పోల్చుకోనని.. తానెప్పుడూ Greatest Of All Time (GOAT) అంటూ క్రిస్‌గేల్ పేర్కొన్నాడు. మోడ్రన్ క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ లాంటి యువ క్రికెటర్లు సెంచరీలతో చాటుతున్న సంగతి తెలిసిందే.

అయితే వీరిలో ఎవరితోనూ తనను పోల్చుకోనని క్రికెట్‌లో ఆల్ టైమ్ ఆటగాడిని తానేనంటూ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో భాగంగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో 'ప్రస్తుత తరంలో ఎవరు గొప్ప క్రికెటర్?' అని ప్రశ్నించగా దానికి క్రిస్ గేల్ తనదైన శైలిలో స్పందించారు.

మంగళవారం జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో క్రిస్ గేల్ (69 బంతుల్లో 146 నాటౌట్‌; 18 సిక్సులు, 5 ఫోర్లు) చెలరేగిపోవడంతో రంగపూర్‌ రైడర్స్‌ టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో 11వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.

38 ఏళ్ల క్రిస్ గేల్‌ వరుసపెట్టి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో ఫైనల్లో ప్రత్యర్థి జట్టు బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఏకంగా 18 సిక్సర్ల బాదాడు. 57 బంతుల్లో సెంచరీ సాధించిన గేల్ మరో 12 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. మొత్తం 128 పరుగులను ఫోర్లు, సిక్సర్ల ద్వారానే రాబట్టాడు.

రెండో వికెట్‌కు గేల్‌, మెక్‌కల్లమ్‌ల జోడీ 201 పరుగులు సాధించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో బెంగళూరు-పుణె వారియర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 17 సిక్సర్లతో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆ రికార్డుని ఇప్పుడు గేల్ తిరగరాశాడు.

ఎవరితోనూ తనని తాను పోల్చుకోనని.. తానెప్పుడూ Greatest Of All Time (GOAT) అని గేల్ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) తదితర టీ20 లీగ్‌ల్లో క్రిస్ గేల్ ఇప్పటికే రికార్డుల సృష్టించాడు.

Story first published: Thursday, December 14, 2017, 13:16 [IST]
Other articles published on Dec 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+