Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌తో వన్డే సిరిస్: ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రిస్ గేల్

West Indies VS England : Chris Gayle Breaks Shahid Afridi's Record For Most Sixes | Oneindia Telugu
Chris Gayle breaks Shahid Afridis record for most sixes in international cricket

హైదరాబాద్: కింగ్‌స్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 129 బంతుల్లో 3 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. గేల్‌ వన్డేల్లో ఇది 24వ సెంచరీ. దీంతో క్రిస్ గేల్ మొత్తం అంతర్జాతీయ సిక్సర్ల సంఖ్య 488కు చేరుకుంది.

100 బంతుల్లో సెంచరీ

100 బంతుల్లో సెంచరీ

ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించిన గేల్, ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగిపోయాడు. తొలి 50 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసిన అతను తర్వాతి 50 బంతుల్లో 79 పరుగులు చేసి సరిగ్గా 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లాండ్ బౌలర్లపై క్రిస్ గేల్ విరుచుకుపడ్డాడు.

అఫ్రిది 476 సిక్సర్ల రికార్డుని బద్దలు కొట్టిన గేల్

అఫ్రిది 476 సిక్సర్ల రికార్డుని బద్దలు కొట్టిన గేల్

మూడు ఫార్మాట్లలో కలిపి గేల్‌కిది 444వ మ్యాచ్‌. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 524 మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును క్రిస్ గేల్‌ బద్దలు కొట్టాడు. వన్డేల్లో 287 సిక్సర్లు బాదిన గేల్‌.. టెస్టుల్లో 98, టీ20ల్లో 103 సిక్సర్లు కొట్టాడు. దీంతో గేల్ బాదిన సిక్సర్లు మైదానం బయట పడటంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఏకంగా నాలుగు సార్లు కొత్త బంతిని తీసుకున్నారు.

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 361

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 361

గేల్‌కు తోడు షాయ్ హోప్‌ (65 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీ సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3, అదిల్ రషీద్ 3, క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 48.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది.

జాసన్ రాయ్, జో రూట్ సెంచరీలు

జాసన్ రాయ్, జో రూట్ సెంచరీలు

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ జాసన్ రాయ్(123), జో రూట్(102) సెంచరీలతో చెలరేగారు. దీంతో తొలి వన్డేలో వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండిస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2, థామస్, దేవేంద్ర బిషూ చెరో వికెట్ తీసుకున్నారు.

Story first published: Thursday, February 21, 2019, 9:14 [IST]
Other articles published on Feb 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+