క్రిస్ గేల్ ఈజ్ బ్యాక్: వెస్టిండిస్ టీ20 జట్టులో చోటు
హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీసేన వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. వన్డే సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డే జులై 6(గురువారం) కింగ్ స్టన్ మైదానంలో జరగనుంది. ఈ వన్డే సిరిస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 జులై 9న జమైకాలో జరగనుంది.
ఈ నేపథ్యంలో కోహ్లీసేనతో తలపడే టీ20 జట్టుని వెస్టిండిస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. టీ20 జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు వెస్టిండిస్ క్రికెట్ బోర్డు చోటు కల్పించింది. టీ20 ఫార్మెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్ మెన్‌గా క్రిల్ గేల్‌కు పేరుంది.

విండిస్ టీ20లో క్రిస్ గేల్‌కు చోటు
టీ20 ఫార్మెట్‌లో క్రిస్ గేల్ 1519 పరుగులతో 35.52 యావరేజిని కలిగి ఉన్నాడు. ఇదిలా ఉంటే అఫ్గానిస్థాన్‌తో ఇటీవలే వెస్టిండిస్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌లో గేల్‌కి స్థానం దక్కలేదు. ప్రస్తుతం లెండిల్ సిమన్స్ స్థానంలో గేల్‌ను ఎంపిక చేసినట్లు విండిస్ బోర్డు చీఫ్ సెలక్టర్ బ్రోనే తెలిపారు.

ఆప్ఘన్ సిరిస్‌లో సిమన్స్ విఫలం
కాగా, ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో సిమన్స్ 6, 17, 16 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో అతడి ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్న విండీస్ బోర్డు భారత్‌తో జరిగే ఏకైక టీ20 కోసం ఎంపిక చేసిన జట్టులో సిమన్స్‌ను తప్పించి గేల్‌కు చోటు కల్పించింది. అంతేకాదు టీ20 మ్యాచ్‌ల్లో గేల్‌కి ఎంతో అనుభవం ఉందని, గేల్‌ని జట్టులోకి తీసుకోవడంతో జట్టు పటిష్ఠంగా ఉందని బ్రోనె చెప్పారు.

గేల్ స్వస్థలమైన జమైకాలో టీ20
అయితే భారత్‌తో జరుగుతున్న ఏకైక టీ20 జరిగే జమైకా గేల్ స్వస్థలం కావడం విశేషం. తన సొంత మైదానం సబీనా పార్క్‌లో గేల్ ఆడుతున్న తొలి టీ20 ఇది. క్రిస్ గేల్ వెస్టిండిస్ తరఫున చివరిసారిగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై ఆడాడు. భారత్‌తో జరిగే ఏకైక టీ20కి రెగ్యులర్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు విశ్రాంతి కల్పించారు. అతడి స్ధానంలో కెప్టెన్ బాధ్యతలను కార్లోస్ బ్రాత్ వైట్‌కి అప్పగించారు.

భారత్‌తో జరిగే ఏకైక టీ20కి వెస్టిండిస్ జట్టు:
కార్లోస్ బ్రాత్‌వైట్(కెప్టెన్), శామ్యూల్ బద్రీ, రాన్స్‌ఫోర్డ బీటన్, క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, జాసన్ మహ్మద్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, రోమన్ పొవల్, మార్లన్ శామ్యూల్, జీరోమ్ టైలర్, చాడ్‌విక్ వాల్టన్(వికెట్‌కీపర్), కిస్రిక్ విలియమ్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications