న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'గేల్ మర్మాంగం చూపలేదు.. అతనికి డబ్బులివ్వండి'

Chris Gayle awarded USD 221,000 in defamation case

సిడ్నీ: పరువు నష్టం దావా కేసులో వెస్టిండీస్ స్టార్ క్రికెట‌ర్ క్రిస్‌గేల్ విజయం సాధించాడు. తనపై తప్పుడు ప్రచారం చేశాడంటూ ఆస్ట్రేలియా పత్రికలపై వేసిన నష్టపరిహారం కేసులో క్రికెట‌ర్ గేల్‌కు 3ల‌క్ష‌ల‌ ఆస్ట్రేలియా డాల‌ర్లు(221,000 అమెరికా డాల‌ర్లు) న‌గ‌దును చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింద‌ని 'ది ఏజ్' త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. పిటిష‌న‌ర్ గేల్‌ డిమాండ్ మేర‌కు ప‌రిహారాన్ని చెల్లించేందుకు ఫెయిర్‌ఫ్యాక్స్ సంస్థ అంగీక‌రించింది.

ఒకే విడ‌త‌లో న‌గ‌దును చెల్లించాల‌ంటూ

ఒకే విడ‌త‌లో న‌గ‌దును చెల్లించాల‌ంటూ

మర్మాంగాన్ని మహిళా ఫిజియోథెరఫిస్ట్‌కు చూపించాడంటూ గేల్‌పై ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్‌ మీడియా గ్రూపులో కథనం వెలువడింది. అయితే అది తప్పని సిడ్నీ జ్యూరీ గ‌తేడాది తీర్పు వెలువరించింది. ఇక నగదు విషయంలో మరోసారి తాజాగా ఒకే విడ‌త‌లో న‌గ‌దును చెల్లించాల‌ంటూ మీడియా సంస్థ‌ను సుప్రీం కోర్టు జ‌స్టిస్ లూసీ మెక్‌క‌ల‌మ్ ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అలాంటి సంఘటనేదీ జరగలేదని గేల్

అలాంటి సంఘటనేదీ జరగలేదని గేల్

2015 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో సిడ్నీలో లియాన్నె రసెల్ అనే మసాజ్ థెరపిస్ట్‌తో గేల్ అసభ్యంగా వ్యవహరించాడని ఆ గ్రూప్‌న‌కు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ది ఏజ్, ది కాన్‌బెర్రా టైమ్స్ క‌థ‌నాలు ప్ర‌చురించాయి. కానీ అలాంటి సంఘటనేదీ జరగలేదని గేల్ వాదించి గెలిచాడు. నష్ట పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. తాజాగా క్రిస్‌గేల్‌కు భారీ మొత్తంలో న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని కోర్టు తుది తీర్పునిచ్చింది.

వేలం మొదలుపెడదామనుకుంటున్నా

వేలం మొదలుపెడదామనుకుంటున్నా

ఈ వివాదమంతా ముగిశాక గేల్ జరిగిన ప్రతి ఇంటర్వ్యూను ఓ ప్రోగ్రాం రూపంలో ప్రసారం చేసేందుకు వేలం నిర్వహిస్తున్నాడట. దానిని గురించి పేర్కొంటూ.. 'నేను గెలిచాను. ఇది ఓ సినిమాలా ఉంది. 300వేల డాలర్ల నుంచి వేలం మొదలుపెడదామనుకుంటున్నా. ఇది నేను చూసి తీరతా' అని 3.75 మిలియన్ ఫాలోవర్లు ఉన్న తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

Story first published: Monday, December 3, 2018, 14:53 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X