Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ చరిత్రలో నేటికీ చెక్కుచెదరని రికార్డు: 13 ఏళ్లైనా తగ్గని ఆ క్రేజ్!

సరిగ్గా 13 ఏళ్ల క్రితం.. ఏప్రిల్ 23, 2013న అంటే సరిగ్గా ఇదే రోజున చిన్నస్వామి స్టేడియంలో ఓ అద్భుతం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ మరుపురాని అధ్యాయం లిఖించబడింది. ఆర్సీబీ, పుణె వారియర్స్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి.. టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

బౌండరీల వర్షం
ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడిన ఇన్నింగ్స్ కేవలం ఓ ప్రదర్శన మాత్రమే కాదు.. అదొక విధ్వంసం. మొత్తం 66 బంతుల్లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన క్రిస్ గేల్.. తన ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లు, 13 ఫోర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు నేటికీ గేల్ పేరు మీదనే ఉంది. బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగుల రికార్డును గేల్ ఈ మ్యాచ్‌తో తుడిచిపెట్టేశాడు.

Chris Gayle 175 13 Years Since the Universal Boss Destroyed Pune Warriors in IPL 2013 Details

కుప్పకూలిన బౌలింగ్ గణాంకాలు
పుణే బౌలర్లను క్రిస్ గేల్ ఉతికి ఆరేశాడు. మిచెల్ మార్ష్ 3 ఓవర్లలో 56 పరుగులు ఇవ్వగా.. అశోక్ దిండా 48 పరుగులు, అలీ ముర్తజా కేవలం 2 ఓవర్లలోనే 45 పరుగులు సమర్పించుకున్నారు. గేల్ వీరవిహారంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 263 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆ సమయంలో ఇది ఓజట్టు చేసిన అత్యధిక స్కోరు. ఆ జట్టులో తిలకరత్నే దిల్షాన్ (33), ఏబీ డివిలియర్స్ (31) కూడా కీలక పరుగులు జోడించారు.

130 పరుగుల భారీ విజయం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుణె వారియర్స్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టీవ్ స్మిత్ (41) మినహా మిగిలిన ఆటగాళ్లెవరూ రాణించలేకపోయారు. విచిత్రమేమిటంటే బ్యాటింగ్ తోనే కాకుండా బౌలింగ్‌లో కూడా గేల్ మెరిశాడు. రెండు వికెట్లు తీసి ఆల్ రౌండ్ షో ప్రదర్శించాడు. ఫలితంగా ఆర్సీబీ 130 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

నేటికి ఈ ఇన్నింగ్స్ జరిగి 13 ఏళ్లు పూర్తయినా.. క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డు, 30 బంతుల సెంచరీ రికార్డును మరెవ్వరూ అందుకోలేకపోవడం విశేషం. ఆధునిక క్రికెట్‌లో ఎందరో హిట్టర్లు వచ్చినా.. ఆ రోజు గేల్ సృష్టించిన తుఫాన్ మాత్రం ఐపీఎల్ అభిమానుల గుండెల్లో అలాగే నిలిచిపోయింది.

Story first published: Thursday, April 23, 2026, 9:51 [IST]
Other articles published on Apr 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+