బ్యాటింగ్‌లో విఫలం: కఠిన నిర్ణయం తీసుకున్న కెప్టెన్ స్మిత్
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టు నుంచి ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ని తప్పించారు. గత కొంతకాలంగా కీపింగ్‌లో నిరాశపరుస్తున్న వేడ్‌ను రెండో టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు.
'వేడ్ బ్యాట్ నుంచి ఆశించిన ప్రదర్శన రావడం లేదు. అతను తరచూ విఫలం కావడంతోనే బంగ్లా మ్యాచ్‌కు అతన్ని బెంచ్‌కే పరిమితం చేస్తున్నాం. వేడ్ బ్యాటింగ్‌లో విఫలమవుతున్న సంగతి అతనికి కూడా తెలుసు. జట్టులో సమతుల్యతో కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు' అని స్మిత్ అన్నాడు.

వేడ్ స్ధానంలో వికెట్ కీపర్ బాధ్యతల్ని హ్యాండ్ స్కాంబ్‌కు అప్పచెప్పనున్నట్లు స్మిత్ తెలిపాడు. వేడ్‌ని తప్పించడం కాస్త కఠిన నిర్ణయమే అయినప్పటికీ, తప్పడం లేదని స్మిత్ పేర్కొన్నాడు. స్మిత్ నిర్ణయాన్ని మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ తప్పుబట్టారు.
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ తొలిసారి ఓ టెస్టులో విజయం సాధించి అరుదైన ఘనత సాధించింది.
కాగా, ఇరు జట్ల మధ్య సోమవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌ను సమం చేయాలంటే రెండో టెస్టులో ఆస్ట్రేలియా తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో రెండో టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తీవ్రంగా శ్రమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications