హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్ కింగ్‌గా పేరొందిన సెహ్వాగ్ మరోసారి తన హాస్య చతురతను ప్రదర్శించాడు. శుక్రవారం తన ట్విట్టర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీపై సెహ్వాగ్ తనదైన శైలిలో జోకులు వేశాడు. రెండు పాండాలు ఉన్న ఓ ఫోటోను సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
అందులో ఒకదాని కళ్లు పెద్దవి కాగా మరో పాండా కళ్లు చిన్నవిగా ఉన్నాయి. రెండు పాండాలను పోలిస్తూ 'మీకు తెలిసిన వారెవరైనా కళ్లద్దాలు తీసేసినప్పుడు..' అంటూ గంగూలీని ఉద్దేశించి కామెంట్ పోస్టు చేశాడు. ఆ తర్వాత వెంటనే గంగూలీ వెంటవెంటనే కళ్లను ఆర్పే అలవాటుపై సరదాగా జోక్ వేశాడు.
'దాదా గంగూలీ.. చైనీస్ గంగూలీ. కంటి రెప్పలు కొడుతూ స్పిన్నర్లు వేసిన బంతులను స్టేడియం బయటికి పంపించిన జ్ఞాపకాలు ఎంతో గొప్పవి' అని సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో కామెంట్ పోస్టు చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.