Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన చైనా క్రికెటర్ మింగ్ లీ

సిడ్నీ: బిగ్ బాష్ లీగ్(బిబిఎల్)లో భాగంగా సిడ్నీ సిక్సర్స్ టీంలో రూకీ కాంట్రాక్ట్ పొంది అంతర్జాతీయ ట్వంటీ20 లీగ్ ఆడుతున్న తొలి చైనా క్రికెట్ ఆటగాడిగా మింగ్ లీ సోమవారం చరిత్ర సృష్టించాడు. లెగ్ స్పిన్నర్ అయిన 24ఏళ్ల లీ, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బౌలింగ్‌ను యూట్యూబ్‌లో చూసుకుంటూ ప్రాక్టీస్ చేశాడు.

ప్రస్తుతం లీ.. క్రికెట్ ఆస్ట్రేలియా రూకీ ప్రొగ్రాంలో భాగంగా ఆస్ట్రేలియా ట్వంటీ20 సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంఛైజీ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 'ది చైనాకు చెందిన తొలి ఆటగాడితో ఒప్పందం కుదుర్చున్న ఫ్రాంఛైజీగా సిడ్నీ సిక్సర్స్ రికార్డు సృష్టించింది' అని సిక్సర్స్ తన వెబ్‌సైట్‌లో సోమవారం పేర్కొంది.

'క్రికెట్ ఆస్ట్రేలియా రూకీ ప్రొగ్రాం కింద గత వేసవి కాలంలో హాంకాంగ్‌కు చెందిన మింగ్ లీ ఈ క్లబ్‌లో ప్రవేశించాడు. 2004 నుంచి క్రికెట్ ఆడుతున్న మింగ్.. 2010లో పపువా న్యూగినియా పర్యటనతో హాంకాంగ్ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2010లో గుంగ్జూ, 2014లో ఇంజియాన్ ఆసియాన్ గేమ్స్‌కు ఎంపికయ్యాడు' అని తెలిపింది.

Chinese cricketer Ming Li creates history in Australia

ఈ సందర్భంగా లీ మాట్లాడుతూ.. 'బిగ్ బాష్ లీగ్‌లోనే ప్రముఖ జట్టైన సిడ్నీ సిక్సర్స్ తరపు ఆడే అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన హాంకాంగ్ క్రికెట్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఈ లీగ్‌లో పాల్గొనడం ద్వారా నా ప్రతిభ మరింత మెరుగుపడుతుంది. మంచి అనుభవం కూడా వస్తుంది' అని తెలిపాడు.

రూకీ తరపున సిడ్నీ సిక్సర్స్‌లో ఆడటం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ అనుభవంతో హాంకాంగ్ క్రికెట్‌లో తప్పక రాణిస్తానని చెప్పాడు. తన క్రికెట్ లక్ష్యాలు సాధించేందుకు ఈ టోర్నీ తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపాడు.

'అధికారిక ట్వంటీ20 మ్యాచులో ఆడుతున్న తొలి చైనా క్రికెటర్‌గా లీ చరిత్రకెక్కాడు. 2012లో షార్జాలో జరిగిన ఐసిసి ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచుతో అతను మైదానంలో అడుగుపెట్టాడు. అతని సోదరి గోడివా కూడా ఆసియన్ గేమ్స్‌లో హాంకాంగ్ మహిళల జట్టుకు ప్రాతినిథ్యం వహించింది' అని సిక్సర్స్ పేర్కొంది.

హాంకాంగ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌కెసిఏ) సిఈఓ టిమ్ కూట్లర్ మాట్లాడుతూ.. 'హాంకాంగ్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక మంచి ఉన్నత పరిణామం. సిడ్నీ సిక్సర్స్, న్యూసౌత్ వేల్స్ క్రికెట్ మధ్య సంబంధాలు కొనసాగడానికి ఇది మరింత దోహదం చేస్తుంది' అని తెలిపారు. కాగా, బిబిఎల్ 5వ ఎడిషన్ డిసెంబర్ 17 నుంచి జరగనుంది. పోటీలో 8జట్లు పాల్గొంటున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+