ఐపీఎల్ 2020: రూ.700 కోట్ల ప్రకటనలు చైనా కంపెనీల నుంచే!

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దు సమస్యలు, తమ ఉత్పత్తులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ వ్యాపార ప్రకటనలపై పెట్టుబడులను పెంచేందుకు చైనీస్‌ కంపెనీలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020 జరిగే రెండు నెలల కాలంలో ఏకంగా రూ.700 కోట్లు ప్రకటన రూపంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు దుబాయ్ వేదికగా క్యాష్ రిచ్ లీగ్‌ జరుగుతుందని ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

వివోనే రూ.150 కోట్ల యాడ్స్..

వివోనే రూ.150 కోట్ల యాడ్స్..

ఇక దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత దృష్ట్యా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ వదిలేసుకోవడానికి సిద్దమైన వివో ఐపీఎల్ సమయంలో ఏటా రూ.150 కోట్లు ఖర్చు చేస్తుందట. ఈ సారీ కూడా అలాగే చేయాలనుకుందంట. ఇక ఇతర చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు కూడా ఇదే బాటలో పయనిస్తాయని మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ ఏజెన్సీ మోగె మీడియా తెలిపింది. హిందీ టెలివిజన్‌ షో 'ది కపిల్‌వర్మ షో'కు చైనీస్‌ బ్రాండ్లు భారీ స్థాయిలో ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ సందీప్‌ గోయెల్‌ ప్రస్తావించారు.

చైనీస్ బ్రాండ్లదే పెద్ద వాటా..

చైనీస్ బ్రాండ్లదే పెద్ద వాటా..

‘లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ మొదలైన కపిల్‌ వర్మ షోలో చైనీస్‌ బ్రాండ్లు ఎక్కువగా కనిపించాయి. ఐపీఎల్‌లోనూ వారు ఎక్కువగా ప్రకటనలు ఇస్తారని అనుకుంటున్నా. స్టార్‌ ఆశిస్తున్న ప్రకటనల ఆదాయంలో ఎక్కువ భాగం వీరి నుంచే వస్తాయి. ఐపీఎల్‌ ప్రకటనల ఆదాయంలో దాదాపు 20-25% చైనీస్‌ బ్రాండ్లదే వాటా.' అని ఆయన తెలిపారు. ఐపీఎల్‌కు చైనీస్‌ మొబైల్ కంపెనీ వివోను టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

తప్పుకున్న వివో..

తప్పుకున్న వివో..

రాజకీయంగా కూడా ఈ నిర్ణయంపై పెద్ద దుమారం రేగింది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఈ సీజన్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని వివో ఇండియా భావించినట్లు ప్రచారం జరుగుతుంది. కనీసం ఈ ఏడాదైన తమ ఒప్పందానికి బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని సోమవారం సాయంత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫ్రాంచైజీలకు కూడా తెలియజేసిందని సమాచారం.

బీసీసీఐకి తలనొప్పి..

బీసీసీఐకి తలనొప్పి..

అయితే వివో నిర్ణయం బీసీసీఐకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో వివో స్థాయి కంపెనీని స్పాన్సర్‌గా తీసుకురావడం బీసీసీఐకి సవాల్‌తో కూడుకున్నదే. వివో ఇచ్చే దాంట్లో సగం సాధించినా గొప్ప విషయమేనని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో ఏడాదికి రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. 2017లో మొత్తం ఐదేళ్లకు ఒప్పందం చేసుకున్న వివోకు 2022 వరకు కాంట్రాక్టు ఉంది.

బీసీసీఐకి షాక్.. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకున్న వివో!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 4, 2020, 21:04 [IST]
Other articles published on Aug 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X