Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్, ఇషాన్.. తల ఎత్తుకోండి! జై షా.. మీరు సూపర్ - రవిశాస్త్రి

సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తమ పేర్లను కోల్పోయిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లకు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. అధైర్య పడకుండా ముందుకు సాగమని హితవు పలికాడు. భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదేశాలను పెడచెవిన పెట్టి దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది.

ఈ నేపథ్యంలో ఈ యువ క్రికెటర్లకు ధైర్యానిస్తూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ''క్రికెట్‌లో పునరాగమనాన్ని స్ఫూర్తిగా నిర్వచిస్తారు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్.. తల ఎత్తుకోండి. సవాళ్లను ఎదుర్కోండి. బలంగా రీఎంట్రీ ఇవ్వండి. మీ గత విజయాలు గొప్పగా చెప్పుకోవచ్చు. మీరు మరోసారి జయిస్తారనడంలో నాకెలాంటి సందేహం లేదు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Chin-up.. Shreyas Iyer and Ishan Kishan- Ravi Shastri

ఫాస్ట్ బౌలర్లను ప్రోత్సహించేందుకు పేసర్లకు స్పెషల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ నిర్ణయాన్ని రవిశాస్త్రి అభినందించాడు. ''ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్‌తో గేమ్ ఛేజింగ్‌ నిర్ణయాన్ని బీసీసీఐ, జై షా తీసుకోవడం అభినందనీయం. ఈ ఏడాదిని గొప్పగా సిద్ధం చేయడానికి ఇది కీలక నిర్ణయం. టెస్టు క్రికెట్, దేశీయ క్రికెట్‌కు ప్రాధాన్యతకు ఇది శక్తివతంమైన సందేశం. క్రికెట్ భవిష్యత్‌కు సరైన స్వరాన్ని సిద్ధంచేస్తున్నారు'' అని రవిశాస్త్రి మరో ట్వీట్ చేశాడు.

ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లో అయిదుగురు యువ పేసర్లు చోటు దక్కించుకున్నారు. ఆకాశ్ దీప్ (బెంగాల్), ఉమ్రాన్ మాలిక్ (జమ్మూ కశ్మీర్), యశ్ దయాల్ (ఉత్తరప్రదేశ్), విద్వత్ కావేరప్ప (కర్ణాటక), విజయ్ కుమార్ వైశాక్ (కర్ణాటక)

సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:
గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ A: రవిచంద్రన్‌ అశ్విన్, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య

గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైస్వాల్

గ్రేడ్ C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్‌ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటిదార్

Story first published: Thursday, February 29, 2024, 9:36 [IST]
Other articles published on Feb 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+