
హైదరాబాద్: పరుగులు మెచ్చారు. ప్రతిభను పురస్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత జట్టు మహిళా కెప్టెన్ మిథాలీరాజ్‌కు ఇళ్ల స్థలం జారీ అయింది. సంబంధిత పత్రాలను దీంతో పాటు కోటి రూపాయలను నగదు చెక్కును సైతం స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు చేతుల మీదుగా మిథాలీ రాజ్ అందుకున్నారు.
స్థల పత్రాలను అందజేసి మంత్రి మిథాలీ రాజ్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం మిథాలీరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహానికి ధన్యవాదాలు అన్నారు. వర్థమాన క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు.

కొద్ది రోజుల ముందే రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మహిళల వరల్డ్ కప్‌లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు మిథాలీని అభినందించారు. వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సృష్టించినందుకు మిథాలీరాజ్‌కు ప్రభుత్వం తరపున నగరంలోని బంజారాహిల్స్‌లో 600 గజాల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు.
అంతేకాకుండా, మిథాలీరాజ్‌ను ప్రపంచస్థాయి క్రికెటర్‌గా తీర్చిదిద్దిన కోచ్ మూర్తికి కృతజ్ఞతలు తెలియజేసి, రూ.25 లక్షలు నగదు బహుమతిని ప్రకటించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.