ఇంగ్లాండ్‌లో వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటించేది ఆరోజే!: ఎమ్మెస్కే ప్రసాద్


హైదరాబాద్: ఏప్రిల్ 20కి ముందే వన్డే వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించనున్నట్లు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ 2019 సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ... అందరి కళ్లు వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ఎప్పుడు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ "కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం బాగా జరిగింది. ఇక, భారత జట్టు విషయానికి వస్తే, ఏప్రిల్ 20కి ముందే వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటిస్తాం. వరల్డ్‌కప్‌కు మంచి టీమ్‌ని ఎంపిక చేస్తామని మేమెంతో ధీమాగా ఉన్నాం" అని అన్నాడు.

తుది జట్టు ఎంపిక కోసం ఏడాదిన్నరగా
"వరల్డ్‌కప్ తుది జట్టు ఎంపిక కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లను గుర్తించామని, ఇందులో కొన్ని మంచి కాంబినేషన్స్‌ను టెస్ట్ చేశాం. మేము ఏదైతే టీమ్‌ని ఎంపిక చేస్తామో... ఆ జట్టు తప్పకుండా ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్‌కప్‌లో తప్పక కప్ గెలుస్తుంది" అని ఎమ్మెస్కే ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఆ మూడు స్థానాల్లోనే అనుమానం
వన్డే వరల్డ్‌కప్‌లో ఆడబోయే తుది జట్టు ఎంపికపై అభిమానుల్లో ఇప్పటికీ మూడు స్థానాల్లోనే అనుమానం నెలకొని ఉంది. NO.4 బ్యాట్స్‌మన్, నాలుగో సీమర్ లేదా మూడో స్పిన్నర్, రెండో వికెట్ కీపర్. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ జట్టు కూర్పు అంతా కుదిరిందని... అయితే, ఒక్క స్థానంలో మాత్రమే ఆలోచించాల్సి ఉందని అన్నాడు. అయితే, ఆ ఒక్క స్థానం ఏంటనేది మాత్రం కోహ్లీ వెల్లడించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications