Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రావిడ్‌ను దాటిన పుజారా: 500 బంతుల్ని ఎదుర్కొన్న తొలి ఇండియన్

రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఛటేశ్వర పుజారా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో 500కు పైగా బంతులు ఆడిన ఏకైక భారత క్రికెటర్‌గా నిలిచాడు.

అంతకుముందు, ది వాల్ రాహుల్ ద్రావిడ్ 495 బంతులు ఆడాడు. ఇప్పటి వరకు అది అత్యుత్తమం. ఇప్పుడు పుజారా 500 బంతులు ఆడాడు. పుజారా ఆదివారం డబుల్ సెంచరీ కూడా చేశాడు.

Cheteshwara Pujara becomes first Indian to face 500 balls in Tests

రాహుల్ ద్రావిడ్ 2004లో రావల్పిండిలో జరిగిన టెస్ట్‌లో 495 బంతులు ఎదుర్కొని 270 పరుగులు చేశాడు. ఆ రికార్డును పుజారా తాజాగా అధిగమించాడు. మూడో టెస్ట్‌ నాలుగో రోజు ఆటలో 525 బంతులు ఎదుర్కొన్న పుజారా 202 పరుగులు చేసి ఔటయ్యాడు. పుజారా 521 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

130 పరుగుల ఓవర్ నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పూజారా 521 బంతుల్లో 21 ఫోర్ల సాయంతో డబుల్‌ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పూజారాకు మూడో డబుల్ సెంచరీ.

ఇదిలా ఉండగా 603/9 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 152 పరుగుల ఆధిక్యంలో ఉంది. విజయ్ డబుల్ సెంచరీతో, సాహా సెంచరీతో అద్భుత ప్రతిభ కనబరిచారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+