
నో పెయిన్ కిల్లర్స్..
క్రికెట్ కోసం తాను ఎంతటి కష్టానైన్నా భరిస్తానని ఈ నయవాల్ చెప్పుకొచ్చాడు. దెబ్బ తాకినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడాని కన్నా నొప్పిని భరించడానికే తాను ఇష్టపడుతానన్నాడు. అందుకే ఆసీస్‌తో జరిగిన ఆఖరి టెస్టులో చాలా గాయాలైనప్పటికీ ఎక్కువ సేపు ఆడగలిగానని తెలిపాడు. ఆ గాయాలు మానడానికి తాను ఎలాంటి చికిత్స తీసుకుంటాడో కూడా వివరించాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి దెబ్బ తగిలినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకునే అలవాటు లేదు. అందుకే ఎంతటి నొప్పినైనా భరించగలను. ఎక్కువ సేపు ఆడాల్సి వచ్చినప్పుడు గాయాలు తగిలే అవకాశముంటుంది. అందుకు సిద్ధపడే బ్యాటింగ్ చేస్తా.

కమిన్స్ బౌలింగ్‌లోనే..
కమిన్స్ బౌలింగ్‌లోనే ఎక్కువగా బంతులు నా శరీరానికి తాకాయి. ముఖ్యంగా బంతి టేకాఫ్ తీసుకునే చోట పిచ్‌పై పగుళ్లున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన బంతులు వేయడంలో కమిన్స్ దిట్ట. అతనికి ఈ విషయంలో అపారమైన నైపుణ్యం ఉంది. ఆ బంతులను డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తే గ్లోవ్స్‌కు తాకి క్యాచ్ ఔటయ్యే ప్రమాదం ఉంది. మ్యాచ్ పరిస్థితి దృష్ట్యా మేం వికెట్లు కోల్పోకూడదు. దాంతో బంతిని నా శరీరానికి తాకించుకోవాలని నిర్ణయించుకున్నా.

ప్రాణం పోయింది..
అయితే బంతి నా శరీరానికి చాలా సార్లు తాకినా.. చేతి వేలికి తాకినప్పుడు ప్రాణం పోయింది. చాలా నొప్పి కలిగింది. బ్యాటింగ్ కొనసాగించడానికి కష్టమైంది. బ్యాట్ పట్టుకోవడానికి కావాల్సిన గ్రిప్ పోయింది. బంతిని హిట్ చేయలని పరిస్థితి ఏర్పడింది. అయితే చివరకు అనుకూల ఫలితం రావడం సంతోషాన్నిచ్చింది. ఈ బాధను మరచిపోయేలా చేసింది. గత(2018-19) పర్యటనలోనే ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించినప్పటికీ.. తాజా సిరీస్ విజయం మాత్రం ప్రత్యేకం.'అని పుజారా చెప్పుకొచ్చాడు.

నా అలవాటే నాకూతురికి..
ఇక ఒంటి నిండా గాయాలతో ఇంటికి రాగానే తన కూతురు ఇంటి చికిత్స చేసి నయం చేసిందని పుజారా తెలిపాడు. ‘ఇంటికి రాగానే నా కూతురు దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది. తనకు గాయమైనప్పుడల్లా.. ప్రేమతో దగ్గర తీసుకుని నేను ముద్దులు పెట్టేవాడిని. ఆ అలవాటే తనకు వచ్చింది. ముద్దు పెడితే గాయం మానుతుందని నా కూతురు నమ్ముతుంది.'అని పుజారా పేర్కొన్నాడు. పుజారా సూపర్ ఇన్నింగ్స్‌కు శుభ్‌మన్ గిల్(91), రిషభ్ పంత్(89 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ తోడవడంతో భారత్ ఆసీస్ గబ్బా కోటలను బద్దలుకొట్టింది.