For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడికి ఎలాంటి బంతులేసినా ఉపయోగం ఉండదు.. ఎలా ఔట్ చేయాలో తెలియలేదు: కమిన్స్‌

Cheteshwar Pujara was the big wicket for me says Pat Cummins

సిడ్నీ: భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌, నయావాల్‌ చెటేశ్వర్‌ పుజారాపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ ప్రశంసలు కురిపించాడు. పుజారా క్రీజులో ఉన్నంతసేపు కఠిన బంతులను ఎదుర్కోవాలనే పట్టుదలతో ఉంటాడని, అలాంటి ఆటగాడికి ఎలాంటి బంతులేసినా ఉపయోగం ఉండదన్నాడు. క్రీజులో పాతుకుపోతే పరుగులు వాటంతట అవే వస్తాయనే ధీమాతో పుజారా బ్యాటింగ్‌ చేస్తాడని కమిన్స్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెళ్లిపోయాక తాను పుజారాపైనే గురిపెట్టానని తెలిపాడు. బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌లో పుజారానే కీలకమని చెప్పుకొచ్చాడు.

పుజారా మీదే దృష్టి సారించా:

పుజారా మీదే దృష్టి సారించా:

తాజాగా పాట్‌ కమిన్స్ క్రికెట్ మంత్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'తొలి టెస్టు తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద వెళ్లిపోతున్నాడని తెలిశాక నేను చెటేశ్వర్‌ పుజారా మీదే పూర్తి దృష్టి సారించా. సిరీస్‌లో గెలవాలన్నా, ఓడాలన్నా అతడే కీలకమని అనుకున్నా. దాంతో వీలైనంత త్వరగా అతడిని ఔట్‌ చేయాలనే నిర్ణయించుకున్నా. ఎందుకంటే.. అంతకుముందు 2018-19 సీజన్‌లోనూ పుజారా కీలకంగా ఆడాడు. అతడికి బౌలింగ్‌ చేయడమే సిరీస్‌లో అన్నింటికంటే పెద్ద విషయమని భావించా' అని కమిన్స్ అన్నాడు.

సిరీస్ విజయంలో పుజారా బ్యాటింగే కీలకం:

సిరీస్ విజయంలో పుజారా బ్యాటింగే కీలకం:

'సిడ్నీ టెస్టును భారత్ డ్రా చేసుకోవడం, గబ్బాలో విజయం సాధించడం.. ఆ రెండింటిలో చెటేశ్వర్‌ పుజారా బ్యాటింగే ముఖ్య భూమిక పోషించింది. క్రీజులో పాతుకుపోతే పరుగులు వాటంతట అవే వస్తాయనే ధీమాతో బ్యాటింగ్‌ చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు కఠిన బంతులను ఎదుర్కోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అలాంటి ఆటగాడికి ఎలాంటి బంతులేసినా ఉపయోగం ఉండదు. అతడు పరుగులు చేయకుండా ఆడుతుంటే.. అలాగే బౌలింగ్‌ చేయాలనే భావన కలుగుతుంది. ఒకవేళ అతడు పరుగులు చేస్తుంటే.. ఆ బౌలర్‌ చేసేదేం లేదు. ఆసీస్ పర్యటనలో పుజారాను ఎలా ఔట్ చేయాలో తెలియలేదు' అని కమిన్స్ పేర్కొన్నాడు.

 నొప్పిని భరిస్తూ ఆడటం విశేషం:

నొప్పిని భరిస్తూ ఆడటం విశేషం:

గబ్బా టెస్టులో చెటేశ్వర్‌ పుజారాకు పలుమార్లు బంతులు ఒంటికి తాకడంపై పాట్‌ కమిన్స్ స్పందించాడు. ఎన్ని దెబ్బలు తాకినా పుజారా అలాగే బ్యాటింగ్‌ చేశాడని, అతడి చేతులు చాలా సున్నితమైనవని కమిన్స్‌ చెప్పాడు. అయినా నొప్పిని భరిస్తూ ఆడటం విశేషమని పొగిడాడు. ఆటపై అతడికున్న అంకితభావం అలాంటిదని కమిన్స్‌ ప్రశంసించాడు. గబ్బా టెస్ట్‌లో పుజారా దాదాపు ఐదు గంటల పాటు క్రీజులో ఉండి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తమ సహనానికి పరీక్షగా నిలిచిన పుజారాను ఆసీస్ బౌలర్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చెక్కు చెదరకుండా ఆడాడు. షాట్ బాల్స్ పదేపదే గాయపరిచే ప్రయత్నం చేసినా.. నొప్పిని భరిస్తూ ఆటను కొనసాగించాడు. చివరకు 211 బంతులు ఆడి 56 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలో అత‌ని శ‌రీరం మొత్తం గాయాల‌య్యాయి.

తొలి ఇన్నింగ్స్‌లో 73 రన్స్:

తొలి ఇన్నింగ్స్‌లో 73 రన్స్:

ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో కనీసం 200 బంతులు ఎదుర్కొన్న రెండో బ్యాట్స్‌మెన్‌గా చెటేశ్వర్‌ పుజారా నిలిచాడు. గతంలో ఇంగ్లడ్‌కి చెందిన బాయ్‌కాట్ (1970-71) మాత్రమే ఈ ఘనతని సాధించాడు. 2020-21 పర్యటనలో మాత్రమే కాదు.. 2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో కూడా పుజారా అదరగొట్టాడు. 600లకు పైగా పరుగులు చేశాడు. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లడ్‌తో ముగిసిన తొలి టెస్టులో పుజారా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 73 రన్స్ చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే పెవిలియన్ చేరాడు.

India vs England: ఏం మాట్లాడుతున్నావ్ మాంటీ.. కుక్‌తో సచిన్‌కు పోలికా?! ఏ ఇంగ్లీష్ ప్లేయర్ సాటిరాడు!!

Story first published: Thursday, February 11, 2021, 17:10 [IST]
Other articles published on Feb 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+