హైదరాబాద్: ఐసీసీ గురువారం విడుదల చేసిన టెస్టు ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే కెప్టెన్ కోహ్లీ ఐదో స్ధానంలో కొనసాగుతుండగా, పుజారా నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం పుజారా 876 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 806 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ 761 రేటింగ్ పాయింట్లతో టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. తాజా టెస్టు ర్యాంకుల్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (938) తొలి స్థానంలో ఉండగా, జో రూట్ (902) రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక న్యూజిలాండ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (880) మూడో స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్ధానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్‌కు చెందిన ఆండర్సన్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. భారత్‌కు చెందిన మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆల్ రౌండర్ల విషయానికి వస్తే టాప్-5లో వరుసగా షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), రవీంద్ర జడేజా (ఇండియా), రవిచంద్రన్ ఆశ్విన్ (ఇండియా), మొయిన్ అలీ (ఇంగ్లండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)లు ఉన్నారు.
ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకులు:
1. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
2. జో రూట్ (ఇంగ్లండ్)
3. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)
4. ఛటేశ్వర్ పుజారా (ఇండియా)
5. విరాట్ కోహ్లీ (ఇండియా)
6. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
7. అజార్ అలీ (పాకిస్థాన్)
8. అలెస్టర్ కుక్ (ఇంగ్లండ్)
9. హషీమ్ ఆమ్లా (దక్షితాఫ్రికా)
10. కేఎల్ రాహుల్ (ఇండియా)
ఐసీసీ టెస్టు బౌలర్ ర్యాంకులు:
1. రవీంద్ర జడేజా (ఇండియా)
2. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్)
3. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా)
4. రంగనా హెరాత్ (శ్రీలంక)
5. జోష్ హాజెల్ ఉడ్ (ఆస్ట్రేలియా)
6. రబడ (దక్షిణాఫ్రికా)
7. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
8. ఫిలాండర్ (దక్షిణాఫ్రికా)
9. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్)
10. నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)
టాప్-5 ఆల్ రౌండర్ల జాబితా:
1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)
2. రవీంద్ర జడేజా (ఇండియా)
3. రవిచంద్రన్ ఆశ్విన్ (ఇండియా)
4. మొయిన్ అలీ (ఇంగ్లండ్)
5. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)