For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో ఛటేశ్వర్ పుజారా

Cheteshwar Pujara to play in Saurashtra Premier League

హైదరాబాద్: భారత టెస్టు బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా మే 14 నుంచి ప్రారంభమయ్యే సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారిక ప్రకటన చేసింది. టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్‌గా పేరుగాంచిన పుజారాను ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‍‌లో ఏ ప్రాంజైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అయితే, పుజారా ఇప్పటికే అనేక దేశవాళీ టీ20 లీగ్‌ల్లో మాత్రం ఆడాడు. ఈ ఏడాది నవీముంబై వేదికగా జరిగిన డీవై పాటిల్ టీ20 కప్‌లో కూడా సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహించాడు. పుజారా సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్‌ ఆడే విషయమై సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ "ఎస్‌పీఎల్ పేరిట నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఎస్‌పీఎల్‌లో ఆడేందుకు పుజారా సంసిద్ధత వ్యక్తం చేశాడు" అని పేర్కొంది.

"పుజారా ఏజట్టు ప్రాతినిథ్యం వహిస్తాడనే దానిపై గురువారం ఐదు జట్ల యజమానులతో పాటు స్వతంత్ర ఆడిటర్ సమక్షంలో ఓ నిర్ణయం తీసుకోనున్నాం. ఎస్‌పీఎల్ ప్రతి ఒక్కరూ ఆడాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం పుజారా ఇంగ్లాండ్‌లో ఉన్నప్పటికీ... ఈ దేశవాళీ టీ20 టోర్నీలో ఆడేందుకు అంగీకరించాడు" అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, పుజారా భారత్ తరుపున 68 టెస్టు మ్యాచ్‌లాడి 5426 పరుగులు చేశాడు. టెస్టుల్లో పుజారా అత్యధిక స్కోరు 206 నాటౌట్. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరిస్ నెగ్గడంలో పుజారా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తద్వారా ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ నెగ్గిన తొలి ఆసియా దేశంగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.

Story first published: Wednesday, May 8, 2019, 18:36 [IST]
Other articles published on May 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+