కోహ్లీ ఎప్పుడూ వాటి గురించే అడుగుతాడు: పుజారా

సౌరాష్ట్ర: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ క్రీజులోకి రాగానే ప్రత్యర్థి బౌలర్ల గురించే మొదటగా అడుగుతాడని టెస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా తెలిపాడు. క్రీజులోకి రాగానే పిచ్ ఎలా ఉంది, బంతి ఎలా స్వింగ్‌ అవుతుంది, ఎలా ఆడితే బాగుంటుందని తనతో చర్చిస్తాడన్నాడు. కోహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు అతని మీదే ధ్యాస పెడతారని, దాంతో తనపై ఒత్తిడి తగ్గుతుందని పుజారా చెప్పాడు. గత కొన్నేళ్లుగా భారత టెస్టు క్రికెట్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ, పుజారా.. తమ ఆటతో ఎన్నోసార్లు మ్యాచ్‌లను గెలిపించారు.

ప్రత్యర్థి బౌలర్ గురించి ఆరాతీస్తాడు

ప్రత్యర్థి బౌలర్ గురించి ఆరాతీస్తాడు

ఛెతేశ్వర్‌ పుజారా తాజాగా క్రిక్‌బజ్‌ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లేతో మాట్లాడుతూ... 'కోహ్లీ, నా మధ్య మంచి అనుబంధం ఉంది. తను క్రీజులోకి రాగానే బౌలింగ్‌ ఎలా ఉందని అడుగుతాడు. బంతి ఎలా స్వింగ్‌ అవుతుందని, ఎలా ఆడితే బాగుంటుందని చర్చిస్తాడు. తనతో బ్యాటింగ్‌ చేయడం నచ్చుతుంది. ఎందుకంటే.. కోహ్లీ సానుకూల దృక్పథంతో ఆడతాడు. ఇక అతను క్రీజులో ఉంటే బౌలర్లంతా తననే ఔట్‌ చేయాలని చూస్తుంటారు. అయితే వాళ్లు త్వరగా ఔట్‌ చేయాలని చూసినా.. కోహ్లీ తనదైన శైలిలో ఆడి వారిపై ఆధిపత్యం చెలాయిస్తాడు' అని తెలిపాడు.

సలహా ఇస్తే స్వీకరిస్తాడు

సలహా ఇస్తే స్వీకరిస్తాడు

'విరాట్ కోహ్లీ ఆడుతుంటే పరుగుల బోర్డు అదే ముందుకు కదులుతుంది. అప్పుడు నాపై అంతగా ఒత్తిడి ఉండదు. ఒక్కోసారి బౌలర్ అతని మీదే దృష్టిసారించి నాకు తేలికపాటి బంతులు వేస్తారు. దాంతో నేను పరుగులు సాధిస్తా. అలాగే కోహ్లీ ఎంత బాగా ఆడుతున్నా ఏదైనా సలహా ఇస్తే స్వీకరిస్తాడు. ఒక్కోసారి బంతులు అతడి బ్యాట్‌కు దూరంగా వెళుతున్నాయని చెబితే వాటిని ఆడకుండా వదిలేస్తాడు. విరామసమయాల్లో అన్ని విషయాలు చర్చిస్తాం' అని పుజారా చెప్పుకొచ్చాడు.

టెస్టు ఆటగాడిగా ముద్ర

టెస్టు ఆటగాడిగా ముద్ర

భారత క్రికెట్‌ జట్టులో టెస్టు ఆటగాడిగా చతేశ్వర్‌ పుజారాపై ముద్ర పడింది. నిజం చెప్పాలంటే అదే అతని కెరీర్‌కు తీవ్ర నష్టం చేసింది. సుదీర్ఘ ఫార్మాట్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా ఉండే పుజారా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అది కూడా ఐదు వన్డేలు. పుజారా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపోడనే అపవాదుతో అతన్ని కనీసం ఐపీఎల్‌లో కూడా ఏ ప్రాంచైజీ పరిశీలించడం లేదు. తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సరిపోతానని ఎంత మొత్తుకున్నా.. భారత జట్టులో కానీ ఐపీఎల్‌లో కానీ ఎవరూ అవకాశం ఇవ్వట్లేదు.

ప్రాక్టీస్ మొదలెట్టిన పుజారా

ప్రాక్టీస్ మొదలెట్టిన పుజారా

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడబోతోంది. దీంతో ఇప్పటి నుంచే పుజారా ప్రాక్టీస్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. డిసెంబరు 3 నుంచి బ్రిస్బేన్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. 2018-19 పర్యటనలో కోహ్లీసేన 2-1తో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో పుజారా అద్భుతంగా ఆడాడు. 74.42 యావరేజితో 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్‌ పుజారా 48.86 సగటుతో 5,840 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు (3 డబుల్‌ సెంచరీలు), 25 అర్థ సెంచరీలున్నాయి. ఇక 5 వన్డేలు ఆడి 51 రన్స్ చేసాడు.

బాబోయ్ ఇక ఆపండి.. నాకు క‌రోనా లేదు: విండీస్ దిగ్గజం

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 6, 2020, 16:13 [IST]
Other articles published on Aug 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X