ఈ సిరిస్‌లో తొలిసారి: ఎడ్జిబాస్టన్ తర్వాత పుజారా బ్యాటింగ్‌లో ఎంత మార్పు!

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో పుజారా సెంచరీ సాధించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 303 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. టెస్టుల్లో పుజారాకు ఇది 18వ సెంచరీ కాగా, ఈ సిరిస్‌లో మూడోది కావడం విశేషం.
ఈ సిరిస్‌లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన టెస్టుల్లో తొలిరోజు 300కుపైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా నాలుగు టెస్టుల సిరిస్‌లో పరుగుల వరద పారిస్తోంది. ఈ సిరిస్‌లో పుజారా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

458 పరుగులతో టాప్ స్కోరర్‌గా
ఇప్పటివరకు మొత్తం 7 ఇన్నింగ్స్ లాడిన పుజారా 458 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సిడ్నీ టెస్టులో పుజారా చేసిన సెంచరీ ఆస్ట్రేలియాపై మొత్తంగా ఐదోది కావడం విశేషం. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఎడ్జిబాస్టన్ టెస్టు నుంచి పుజారాను తప్పించిన సంగతి తెలిసిందే.

పుజారా ప్రదర్శనలో చాలా మార్పు
అయితే, ఆ తర్వాత పుజారా ప్రదర్శనలో చాలా మార్పు వచ్చింది. క్రీజులో పాతుకుపోయి ఎంతో ఓపికగా, సహనంతో బౌలర్లను ఎదుర్కొంటూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఎడ్జిబాస్టన్ టెస్టు తర్వాత పుజారా నాలుగు టెస్టు సెంచరీలు సాధించాడు. ప్రస్తుత ఆసీస్ సిరిస్‌లో టీమిండియా గెలిచిన అడిలైడ్, మెల్ బోర్న్ టెస్టులకు కారణంగా పుజారా సెంచరీలే.

పుజారాపై కోహ్లీ ప్రశంసలు
మెల్ బోర్న్ టెస్టు అనంతరం పుజారా ప్రదర్శనపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత సిరిస్‌లో పుజారా 500 పరుగులకు చేరువయ్యాడు. సిడ్నీ టెస్టు సెంచరీతో పుజారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన భారత్ ఆటగాళ్ల జాబితాలో పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు.

సచిన్ రికార్డు బద్దలు
ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్(195) తొలి స్థానంలో ఉండగా, వరుసగా రెండు, మూడు స్థానాల్లో మురళీ విజయ్(144), సునీల్ గావస‍్కర్(132)లు ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని పుజారా ఆక్రమించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో తొలి రోజు ఆటలో సచిన్ టెండూల్కర్(124) నమోదు చేసిన రికార్డును పుజారా అధిగమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications