బెంగుళూరు టెస్టు: పుజారా రికార్డుల మోత, మ్యాచ్ హైలెట్స్ ఇవే
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీలు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అయితే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 221 బంతులను ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సు సాయంతో తృటిలో సెంచరీని చేజార్చుకున్న (92 పరుగులు) ఛటేశ్వర్ పుజారా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. పుజారా అర్ధసెంచరీ చేయడంతోనే రెండో ఇన్నింగ్స్‌లో జట్టు 274 పరుగులు చేయగలిగింది.
ఐదో వికెట్ భాగస్వామానికి పుజారా, రహానేలు ఇద్దరూ 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో టెస్టులో పుజారా తన ఖాతాలో కొన్ని రికార్డులు వేసుకున్నాడు. అవేంటంటే...

1000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ పుజారా
* స్వదేశంలో ఒక సీజన్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 1000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ పుజారా. అంతక ముందు పాంటింగ్ 965 పరుగుల (2003-04) రికార్డును పుజారా అధిగమించాడు.
* ఒక సీజన్‌లో మూడో స్థానంలో (స్వదేశం, విదేశాల్లో) 1000 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా పుజారా చరిత్ర సృష్టించాడు. మొహిందర్ అమర్‌నాథ్ (965 పరుగులు 1982-83)ను పుజారా అధిగమించాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ 1,241 పరుగులతో ఉన్నాడు.

2,055 బంతుల్ని ఎదుర్కొన్న పుజారా
* 2016-17 సీజన్‌లో పుజారా 2,055 బంతుల్ని ఎదుర్కొన్నాడు. తద్వారా స్వదేశంలో ఒక సీజన్‌లో 2000 బంతుల్ని ఎదుర్కొన్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతకముందు విరాట్ కోహ్లీ 1,980 బంతుల రికార్డును పుజారా అధిగమించాడు.
* 118 పరుగులు. బెంగళూరు టెస్టులో పుజారా, రహానేలు నెలకొల్పిన భాగస్వామ్యం. ఈ సిరీస్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం.

కోహ్లీ తర్వాత పుజారానే
* రెండో టెస్టు ముూడో రోజు ఆటలో భాగంగా ఒక వికెట్ కూడా పడలేదు. ఈ సిరిస్‌లో ఒక వికెట్ కూడ పడకుండా ఆడిన సెషన్ ఇదే కావడం విశేషం.
* హోం సీజన్‌లో 1000 పరుగులు చేసిన ఇద్దరు ఆటగాళ్లలో రెండో ఆటగాడు పుజారా. అంతకముందు ఈ సీజన్‌లో కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేశాడు.
* 2003-04 సీజన్‌లో ఇదే విధంగా వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌లు 1000 పరుగులు పూర్తి చేశారు.

టెస్టుల్లో 1000 పరుగులు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్
* ఓపెనర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనతను అందుకున్న ఆరో కర్ణాటక బ్యాట్స్ మెన్‌గా అవతరించాడు. అంతక ముందు రాహుల్ ద్రవిడ్, గుండప్ప విశ్వనాథ్, సయ్యద్ కిర్మాణీ, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్‌లు ఈ ఘనత సాధించారు. మొత్తంగా చూస్తే ఈ ఘనత సాధించిన 64వ ఇండియన్ బ్యాట్స్‌మెన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications