Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుజారా ఔట్: డీఆర్ఎస్‌పై కోహ్లీ సేన అనుభవలేమి

హైదరాబాద్: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)కు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టీమిండియా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుందా? అంటే కాదనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేసిన రెండు తప్పిదాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని అంటున్నారు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా ఔటైన సందర్బంలో డీఆర్ఎస్‌ను కోరలేదు.

దీంతో భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరిస్‌లో డీఆర్ఎస్ వినియోగంపై పలు విమర్శలు వస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్ఫిన్నర్ వేసిన రషీద్ వేసిన బౌలింగ్ లో పూజారా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆన్ ఫీల్డ్ ఎంఫైర్ ఎల్బీడబ్ల్యూ ప్రకటించడంతో పుజారా పెవిలియన్‌కు చేరాడు.

అయితే క్రీజులో నుంచి పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో డీఆర్ఎస్‌ను అడగాలనే విషయాన్ని పుజారా మరిచిపోయాడు. అవతలి ఎండ్‌లో ఉన్న మురళీ విజయ్‌ను ఏ మాత్రం సంప్రదించకుండా పుజారా పెవలియిన్‌కు ఇప్పడు చర్చనీయాంశమైంది.

రివ్యూకు వెళ్లమని పుజారాకు చెప్పని విజయ్

రివ్యూకు వెళ్లమని పుజారాకు చెప్పని విజయ్

ఈ విషయంపై మురళీ విజయ్ కూడా రివ్యూకు వెళ్లమని పూజారాకు చెప్పలేదు. అయితే పూజారా ఎల్‌బీడబ్ల్యూగా అవుటైన బంతి పిచ్ అయిన తరువాత లెగ్ స్టంప్ బయటకు వెళుతున్నట్లు స్పష్టంగా కనబడింది. దీనిని బట్టి పుజారా ఔట్ కాలేదని విషయం రిప్లేలో కనబడింది.

సరిగా వినియోగించుకుని టీమిండియా

సరిగా వినియోగించుకుని టీమిండియా

అయితే అప్పటికే పుజారా పెవిలియన్‌కు చేరాడు. జట్టులోని కీలక ఆటగాడు ఉన్న అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోపోతే ఫలితం ఇలానే ఉంటుందని క్రీడా పండితులు విమర్శిస్తున్నారు. తొలి టెస్టు డ్రా అయింది కాబట్టి దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అదే భారత్ ఓడిపోయి ఉంటే విమర్శల దాడి తీవ్రంగానే ఉండేదని అంటున్నారు.

రెండో వికెట్‌గా పూజారా అవుటైన తర్వాత భారత్ ఒత్తిడి

రెండో వికెట్‌గా పూజారా అవుటైన తర్వాత భారత్ ఒత్తిడి

అంతేకాదు భారీ లక్ష్య ఛేదనలో పుజారా రెండో వికెట్‌గా అవుటైన తర్వాత టీమిండియా తడబడింది. వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుని ఒత్తిడిలోకి వెళ్లింది. అయితే విరాట్ కోహ్లి, రవి చంద్రన్ అశ్విన్, జడేజాలు రాణించడంతో భారత జట్టు ఓటమి నుంచి తృటిలో తప్పించుకుని మ్యాచ్‌ని డ్రాగా ముగించింది.

కోహ్లీ సేన అనుభవలేమి

కోహ్లీ సేన అనుభవలేమి

దీనిని బట్టి చూస్తే డీఆర్ఎస్‌ను సక్రమంగా వినియోగించుకోవడంలో కోహ్లీ సేన అనుభవలేమి కనబడింది. ఇంకొకటి రెండో ఇన్నింగ్స్‌లో అలెస్టర్ కుక్ ఆడిన ఒక బంతి బ్యాట్‌ను తాకి చేతిలో పడినట్లు భావించిన వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా అవుటైనట్లుగా అప్లై చేశాడు. ఈ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.

సాహా సూచనను పాటించి డీఆర్ఎస్‌కు వెళ్లిన కోహ్లీ

సాహా సూచనను పాటించి డీఆర్ఎస్‌కు వెళ్లిన కోహ్లీ

దీనిపై డీఆర్ఎస్‌కు వెళ్లాలని భావించిన సాహా.. ఆ విషయాన్ని కెప్టెన్ కోహ్లికి చెప్పాడు. సాహా సూచనను పాటించి కోహ్లి డీఆర్ఎస్‌కు వెళ్లాడు. ఆ బంతి అసలు బ్యాట్‌కు తాకకపోగా, చాలా దూరం నుంచి వెళ్లుతున్నట్లు రిప్లేలో కనిపించింది. దాంతో భారత్ ఆ రివ్యూలో విఫలమైంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ డీఆర్ఎస్‌పై తాము ఇంకా మెరుగపడాలని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+