Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మిల్క్‌షేక్ ఇచ్చి తాపం తీర్చమని అడిగా'(వీడియో)

Cheteshwar Pujara Reveals His Recovery Drink Post Adelaide Ton

అడిలైడ్‌: ఆసీస్‌తో టీమిండియా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ పూర్తి చేసుకుంది. సెంచరీ బాది ఛెతేశ్వర్‌ పుజారా జట్టును ఆదుకున్నాడు. వికెట్లు పేకమేడల్లా కుప్పకూలుతున్నా.. తానొక్కడై పోరాటం చేశాడు. ఏ మాత్రం ఆసీస్ కవ్వింపులకు తావివ్వకుండా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాచ్‌ అనంతరం పుజారా మీడియాతో మాట్లాడుతూ రోజంతా ఎండవేడిని తట్టుకోలేకపోయానని అన్నాడు.

రోజంతా ఆడటంతో ..తట్టుకోలేకపోయా.

ఓ పక్క సెంచరీ చేసిన ఆనందం, మరోవైపు రోజంతా నిలబడి ఆడటంతో ఎండతాపం తట్టుకోలేకపోయా. మ్యాచ్ అనంతరం వచ్చి ‘అలిసిపోయాను..మిల్క్‌షేక్‌ ఇవ్వండి' అని అడిగాను. అక్కడున్న వాళ్లందరూ నవ్వుకున్నారు. నిజంగా ఆసీస్‌ గడ్డ మీద ఎండ ఎక్కువగా ఉంది. స్వదేశంలో ఎండతీరు ఆసీస్ గడ్డపై ఎండకు సంబంధం లేదు. సొంత గడ్డపై ఎన్నో మ్యాచ్‌లు ఆడాం. కానీ ఆసీస్‌లో ఉండే వాతావరణాన్ని తట్టుకోవడం కాస్త కష్టమే.

సూచన మేరకు ఐస్‌బాత్‌ చేశా

సూచన మేరకు ఐస్‌బాత్‌ చేశా

మిల్క్‌షేక్‌ ఒక్కటే నన్ను ఆ తాపం నుంచి కాపాడింది. కానీ ఫిజియో వైద్యుల సూచన మేరకు ఐస్‌బాత్‌ చేయాల్సి వచ్చింది. 127 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయన స్థితిలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలనుకున్నా. కానీ, టీమిండియా వరుస వికెట్లు పడుతుంటే నా మీద బాధ్యత పెరుగుతుందన్నట్లు భావించా. అశ్విన్‌ వికెట్‌ కోల్పోయిన వెంటనే షాట్లు కొట్టడం మొదలు పెట్టా.

పొరబాట్లను సరిదిద్దుకుని రెండో ఇన్నింగ్స్‌లో

పొరబాట్లను సరిదిద్దుకుని రెండో ఇన్నింగ్స్‌లో

‘కసితో ఆడా. ఇలా ఒక దశలో మంచి నీళ్లు కూడా తాగాలనుకోలేదు. నా టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ టెస్టుల్లో ఇదొకటి. తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో చేసిన పొరబాట్లను సరిదిద్దుకుని రెండో ఇన్నింగ్స్‌లో రాణించాలని భావిస్తున్నాం' అని తెలిపాడు.

తొలి ఇ‌న్నింగ్స్‌లో పూజారా దూకుడు

తొలి ఇ‌న్నింగ్స్‌లో పూజారా దూకుడు

తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (123: 246 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సు) వీరోచిత సెంచరీతో భారత్ పరువు నిలిపాడు. తొలిరోజైన గురువారం మొత్తం 85.5 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన పుజారా తనదైన శైలిలోనే ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టు సెంచరీతో పుజారా టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 108 ఇన్నింగ్స్‌ల్లో పుజారా ఈ ఘనత సాధించాడు.

1
43623
Story first published: Friday, December 7, 2018, 7:43 [IST]
Other articles published on Dec 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+