లైట్ తీసుకున్న పుజీ..
మూడేళ్ల తర్వాత సెంచరీ చేసే ఛాన్స్ మిస్ అవడాన్ని పుజారా లైట్ తీసుకున్నాడు. 'నేను ఆడిన విధానం నాకు తృప్తినిచ్చింది. ఈ పిచ్ పై బ్యాటింగ్ అంట ఈజీ కాదు. ఒక్కోసారి మనం ఆ మూడంకెల స్కోరు మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ ఈ ఆటలో అది ముఖ్యం కాదు. జట్టుకు గెలిచే పరిస్థితి కల్పించడమే ముఖ్యం' అని చెప్పాడు.
అది మంచి బాల్..
తనను అవుట్ చేసిన తైజుల్ ఇస్లాం బౌలింగ్ ను పుజారా మెచ్చుకున్నాడు. తైజుల్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి పుజారా ప్రయత్నించగా.. మంచి టర్న్ తీసుకున్న ఆ బంతి వికెట్లను కూల్చింది. దీనిపై స్పందించిన పుజారా.. 'అందరూ మూడంకెల స్కోరు చెయ్యాలని అనుకుంటారు. కానీ నేను ఆడిన తీరు, చేసిన 90 పరుగులు జట్టుకు చాలా కీలకం.ఇంకో పది పరుగులే కదా అనడానికి లేదు. ఎందుకంటే అది చాలా మంచి బాల్. దానికి నేను ఏం చేయలేను' అని స్పష్టం చేశాడు.
టాపార్దర్ ఫెయిల్..
ఈ మ్యాచులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ (20), కేఎల్ రాహుల్ (22) తమకు దక్కిన ఆరంభాలను భారీ స్కార్లుగా మలచలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (1) వేరియబుల్ బౌన్సుకు బలయ్యాడు. దీంతో భారత జట్టు 48 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
కీలక భాగస్వామ్యాలు..
టాప్ ఆర్డర్ వైఫల్యం వల్ల కష్టాల్లో ఉన్న జట్టును వికెట్ కీపర్ రిషభ్ పంత్ (46)తో కలిసి పుజారా ఆదుకున్నాడు. అయితే లంచ్ తర్వాత పంత్ కూడా పెవిలియన్ చేరాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కూడా పుజారా అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు.ఒకవిధంగా తొలి రోజు ఆటలో భారత జట్టు కమాండింగ్ పొజిషన్ లో నిలిచింది అంటే దానికి కారణం పుజారా ఇన్నింగ్స్ అనడంలో తప్పు లేదు..


Click it and Unblock the Notifications












