
ససెక్స్ తరఫున చటేశ్వర్ పుజారా సెక్సీ క్రికెటింగ్ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. రాయల్ లండన్ వన్ డే కప్ 2022లో ససెక్స్ తరఫున పుజారా వరుసగా రెండో సెంచరీని సాధించాడు. టెస్ట్ స్పెషలిస్ట్ అని పేరుపడ్డ పుజారాలో మరో యాంగిల్ ఏంటో చూపిస్తున్నాడు. ఈ సీజన్లో కౌంటీల్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరొందిన పుజారా ప్రస్తుతం వన్డే క్రికెట్లోనూ తన ప్రభావవంతమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.అతను బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వార్విక్‌షైర్‌పై సస్సెక్స్ అద్భుతమైన విజయాన్ని సాధించడంలో సహాయపడాడు.
ఆ మ్యాచులో పుజారా 79బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్‌లతో 107పరుగులు చేసి సత్తా చాటాడు. తాజాగా అతను సర్రేపై మరో సెంచరీని సాధించాడు. పుజారా 131బంతుల్లో 174పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేటు 132గా ఉండడం గమనార్హం. అతని ఇన్నింగ్స్‌లో 20 బౌండరీలున్నాయి. అలాగే 5 సిక్సులు కూడా బాదాడు. తద్వారా ససెక్స్ నిర్ణీత 50ఓవర్లలో 378పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. పుజారా 103బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకోగా.. మిగతా 28బంతుల్లో అతను 74పరుగులు చేశాడు.
అంటే అతని వీరవిహారం ఏ రేంజులో కొనసాగగిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు సాధించిన తర్వాత అతను సెలబ్రేట్ చేసుకున్న విధానం కూడా వైరలైంది. ఇక లిస్టు ఏ ఫార్మాట్లో ససెక్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు (174) చేసిన ప్లేయర్‌గా పుజారా నిలిచిపోయాడు. ఇకపోతే దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత భారత టెస్టు జట్టు నుంచి పుజారాకు ఉద్వాసన ఎదురైంది.
అయితే తనను డ్రాప్ చేసిన ఒక రోజు తర్వాత రంజీ ట్రోఫీలో సెంచరీ చేయడంతో అతను తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత కూడా కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ రాణించాడు. తద్వారా ఇంగ్లాండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో మళ్లీ చోటు సంపాదించాడు. కొన్ని మ్యాచులు ససెక్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. పుజారా ఇదే రీతిలో ఆడితే భారత వన్డే జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలున్నాయి.