టెస్టుల్లో టీమిండియాకు కోహ్లీ ఎంతో పుజారా కూడా అంతే!: గంగూలీ


హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో ఛటేశ్వర్ పుజారా ఆటతీరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సమానంగా చేసిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పుజారా అద్భుత ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని గంగూలీ ప్రశంసల వర్షం కురిపంచాడు.
తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ఎలా చెలరేగాడో మనందరికీ గుర్తుంది. నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు పుజారా అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపించాడు. ఎందుకంటే అతడు సెంచరీ బాదిన అన్ని మ్యాచ్‌లూ భారత్ గెలిచింది" అని అన్నాడు.

సిడ్నీలో విజయం భారత్‌దే
"సిడ్నీలోనూ అదే జరుగుతుందని అనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కైవసం చేసుకొనేందుకు టీమిండియా చేరువలో ఉంది. ప్రస్తుత మ్యాచ్‌లో కోహ్లీసేన ఓడిపోతుందని అనుకోను. మూడో స్థానంలో ఆడుతున్న పుజారా ఏ కెప్టెన్‌కైనా ఒక ఆస్తిలాంటి వాడు. టెస్టు క్రికెట్‌లో ఈ స్థానం చాలా ముఖ్యమైంది" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

పుజారా స్ట్రైక్‌రేట్ గురించి మాట్లాడారు
"ఆరు నెలల క్రితం ఇంగ్లాండ్‌లో ఆడుతున్నప్పుడూ పుజారా స్ట్రైక్‌రేట్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఉపఖండం ఆవల ఆస్ట్రేలియాపై అతడి మూడు సెంచరీలు ఎంత ప్రభావం చూపించాయో మనకు తెలిసిందే. పుజారా వాండరర్స్‌లో చేసిన 50 పరుగులు వంద పరుగులతో సమానం. ఈ టెస్టు సిరీస్ తర్వాత టెస్టు జట్టులో పుజారా విరాట్ కోహ్లీతో సమానమని భావిస్తున్నా" అని గంగూలీ అన్నాడు.

ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో పుజారా చెలరేగి ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పుజారా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 74.42 సగటుతో 521 పరుగులు చేశాడు. ఈ సిరిస్‌లో మొత్తం మూడు సెంచరీలతో ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. సిడ్నీ టెస్ట్‌లో పుజారా సెంచరీతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

టెస్టుల్లో 18వ సెంచరీ చేసిన పుజారా
కెరీర్‌లో 68వ టెస్ట్ ఆడుతున్న పుజారాకు ఇది టెస్టుల్లో 18వ సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై మొత్తంగా ఐదోది. ప్రస్తుత సిరీస్‌లో మూడోది. ఈ క్రమంలో పుజారా ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

పుజారా సెంచరీలు
ఆస్ట్రేలియా సిరిస్‌లో పుజారా సెంచరీలు:
అడిలైడ్ టెస్ట్ : 123 (246 బంతులు )
మెల్‌బోర్న్ టెస్ట్ : 106 (319 బంతులు)
సిడ్నీ టెస్ట్ : 193 (373 బంతులు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications