ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39వ సెంచరీ: కౌంటీల్లో చెలరేగిన పుజారా
హైదరాబాద్: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాకాల్లో ఇంగ్లాండ్‌లో బిజీగా ఉంటే, జట్టులో చోటు దక్కించుకోలేని మరో భారత ఆటగాడు ఛటేశ్వర్ పుజారా ఆ దేశంలోనే మరో చోట అద్భుత ప్రదర్శన చేశాడు.
ఇంగ్లాండ్‌లో కౌంటీల్లో నాటింగ్‌హామ్ షైర్‌కు ఆడుతున్న పుజారా శుక్రవారం తన రెండో మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే జట్టులో చోటు దక్కించుకోలేని పుజారా ఇంగ్లాండ్‌లో కౌంటీలకు ఆడుతున్న సంగతి తెలిసిందే.

గ్లూసెస్టర్‌షైర్‌తో శుక్రవారం ప్రారంభమైన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో పుజారా 174 బంతుల్లో 13 ఫోర్లతో 112 పరుగులు చేసి అవుటయ్యాడు. పుజారాతో పాటు మైకేల్ లంబ్ (117) కూడా సెంచరీ బాదడంతో తొలి రోజు నాటింగ్‌హామ్ 96 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పుజారాకిది 39వ సెంచరీ. ఈ సీజన్లో ఆడిన తొలి కౌంటీ మ్యాచ్‌లో 2 పరుగులే చేసిన పుజారా.. రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. త్వరలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పుజారా 12,000 పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు.
ఇదిలా ఉంటే టీమిండియా తరుపున 48 టెస్టు మ్యాచ్‌లాడిన పుజారా 51.32 యావరేజితో 11 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications