For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్ తీసిన ఆనందంలో పూజారా: శిఖర్ ధావన్ ఫన్నీ కామెంట్

 Cheteshwar Pujara gets trolled by Shikhar Dhawan after picking up a wicket in Ranji Trophy match

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా ఉత్తర ప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు ఛటేశ్వర్ పుజారా మాయ చేశాడు. శుక్రవారమైన రెండో రోజు ఆటలో భాగంగా ఆఖరి ఓవర్‌‌లో పుజారా బంతితో మెరిశాడు. ఉత్తర ప్రదేశ్ బ్యాట్స్‌మన్‌ మోహిత్‌ జంగ్రాను రెండో బంతికి పుజారా తన లెగ్‌ స్పిన్‌తో ఔట చేయడం ఆటకే హైలెట్‌గా నిలిచింది.

ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తాను బ్యాట్స్‌మన్‌ నుంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగానని సరదాగా కామెంట్‌ చేశాడు. అయితే పుజారా వికెట్‌ తీయడం పట్ల సహచర క్రికెటర్లు, అభిమానులు ఆనందంవ్యక్తం చూస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తనదైన శైలిలో ట్రోలింగ్‌కు దిగాడు. "అద్భుతంగా బౌలింగ్‌ చేశావు. నీ పరుగుల వేగానికి స్ర్పింటర్‌ కూడా తట్టుకోలేక చచ్చిపోతాడు" అని కామెంట్ పెట్టాడు. రవిచంద్రన్ ఆశ్విన్ అయితే "అసాధారణం, ఇక మరింతగా బౌలింగ్‌ చేసే సమయం వచ్చింది" అంటూ కామెంట్ పెట్టాడు.

పుజారా ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 192 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఉత్తర ప్రదేశ్ ఇంకా బలమైన స్థితిలో ఉంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 331 పరుగులు చేసింది. షెల్డన్ జాక్సన్ (57), ఓపెనర్ హర్విక్ దేశాయ్ (54) హాఫ్ సెంచరీలు చేశారు.

Story first published: Saturday, December 28, 2019, 13:24 [IST]
Other articles published on Dec 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+