For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేతకాని చేతేశ్వర్: అవుట్ కావడంలోనూ అదోరకం స్పెషాలిటీ: ఫ్లాప్ షో కంటిన్యూస్

Cheteshwar Pujara Gets Brutally Trolled After Getting Out Most Number Of Times To Anderson

లండన్: ఇంగ్లాండ్‌తో ఆడుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘోరంగా విఫలమౌతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ధాటికి ఏ మాత్రం నిలవలేకపోతోంది. వెంటవెంటనే వికెట్లను కోల్పోతోంది. 21 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయిన దయనీయ స్థితిలో పడింది భారత జట్టు. ఈ మూడు వికెట్లు కూడా అండర్సన్ ఖాతాలోకే వెళ్లిపోయాయి. అండర్సన్ దూకుడు.. అక్కడితో ఆగేలా కనిపించట్లేదు. వైవిధ్యమైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాట్స్‌మెన్ల భరతం పడుతోన్నాడా వెటరన్.

తొలి ఓవర్‌లోనే పతనం బిగిన్స్

భారత జట్టు బ్యాటింగ్ పతనం.. తొలి ఓవర్‌లోనే ఆరంభమైంది. జేమ్స్ అండర్సన్ సంధించిన తొలి ఓవర్ అది. ఆ ఓవర్ అయిదో బంతికి కేఎల్ రాహుల్‌ను బలి తీసుకున్నాడు. అండర్సన్ విసిరిన ఇన్‌స్వింగర్‌ను అర్థం చేసుకోవడంలో సెకెనులో వందోవంతు తడబడ్డాడు కేఎల్ రాహుల్. ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు. ఆ స్ప్లిట్ సెకెండ్ వ్యవధిలోనే అతని బ్యాట్‌ను ముద్దాడుతూ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతిలో వాలిందా అండర్సన్ సంధించిన బంతి. అప్పటికి జట్టు స్కోరు ఒకటే.

నాలుగో ఓవర్‌లో పుజారా అవుట్

నాలుగో ఓవర్‌లో అండర్సన్ మరోసారి తన తడాఖా చూపాడు. ఈ సారి- మిస్టర్ డిపెండబుల్‌గా పేరున్న చేతేశ్వర్ పుజారా పెవిలియన్ బాట పట్టాడు. కేఎల్ రాహుల్ అవుట్ అయిన విధానానికి రీప్లే చూస్తున్నట్టనిపించింది పుజారా పెవిలియన్ దారి పట్టిన విధానం. ఆఫ్ స్టంప్‌కు అతి సమీపానికి వచ్చిన ఇన్ స్వింగర్‌ను ఆడటంలో తొందరపడ్డాడు పుజారా. కాస్త లేట్‌గా బౌన్స్ అయిన గుడ్ లెంగ్త్ బంతి బ్యాట్ మీదికి రాకముందే ఆడాడు. దీనితో టైమింగ్ మిస్ అయింది. ఎడ్జ్ తీసుకున్న ఆ బాల్ నేరుగా బట్లర్ చేతిలోనే వాలింది. అప్పటికి జట్టు స్కోరు నాలుగు పరుగులే.

ఇక కోహ్లీ వంతు..

చేతేశ్వర్ పుజారా అవుటైన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కాస్త కుదురుగా కనిపించినప్పటికీ.. దాన్ని కొనసాగించలేకపోయాడు. అండర్సన్ చేతికే చిక్కాడు. 10వ ఓవర్ అయిదో బంతికి కోహ్లీ బ్యాటెత్తేశాడు. అండర్సన్ వేసిన అవుట్ స్వింగర్‌ను మిడాఫ్ దిశగా డ్రైవ్ చేయబోయాడు..అది సక్సెస్ కాలేదు. టైమింగ్ మిస్ కావడంతో బంతి మళ్లీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని బట్లర్ అందుకున్నాడు. ఒకే బౌలర్ చేతిలో వికెట్ కీపర్ క్యాచ్ పట్టడం ద్వారా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు అవుట్ కావడం కూడా అరుదైన ఘటనే.

చేతేశ్వర్ పుజారా ట్రోల్స్

చేతేశ్వర్ పుజారా మరోసారి ఘోరంగా విఫలం కావడం పట్ల నెటిజన్లు అంతే ఘోరంగా అతనిపై నిప్పులు చెరుగుతున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. పుజారా జట్టుకు భారంగా పరిణమించడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక అవసరం లేదని తేల్చి చెబుతోన్నారు. పుజారాను తుది జట్టులోకి ఎలా తీసుకున్నారనడానికి కారణాలను టీమిండియా మేనేజ్‌మెంట్ వెల్లడించాలని డిమాండ్ చేస్తోన్నారు. తుది 11 మందిలో చేతేశ్వర్ పుజారాకు ఏ ప్రాతిపదికన చోటు కల్పించారని నిలదీస్తోన్నారు. మీమ్స్‌తో చెడుగుడు ఆడుకుంటోన్నారు. అతనికి ఉద్వాసన పలకడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని తేల్చి చెబుతున్నారు.

అండర్సన్ చేతిలో పదిసార్లకు పైగా..

అవుట్ కావడంలో కూడా చేతేశ్వర్ పుజారా సరికొత్త రికార్డ్ సృష్టించినట్టయింది. తన స్పెషల్ క్వాలిటీస్‌ను ప్రదర్శించినట్టయింది. ఇప్పటిదాకా పదిసార్లకు పైగా అతను అండర్సన్ చేతుల్లో పడి అవుట్ అయ్యాడు. ఒక టీమిండియా క్రికెటర్.. ఒకే బౌలర్ చేతిలో 10సార్లకు పైగా అవుట్ కావడం అనేది కూడా ఓ రికార్డుగానే పరిగణిస్తోన్నారు నెటిజన్లు. అండర్సన్‌కు తన వికెట్‌ను సమర్పించుకోవడం ద్వారా తన కమిట్‌మెంట్‌ను మరోసారి నిరూపించుకున్నాడంటూ మండిపడుతోన్నారు.. సెటైర్ల మీద సెటైర్లు సంధిస్తున్నారు.

Story first published: Wednesday, August 25, 2021, 17:07 [IST]
Other articles published on Aug 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+