County Championship: 118ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన చటేశ్వర్ పుజారా.. మరోసారి డబుల్ సెంచరీతో సత్తా

ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్ తరఫున ఆడుతున్న భారత బ్యాటర్ చటేశ్వర్ పుజారా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి డబుల్ సెంచరీ సాధించాడు. ఇక తద్వారా ఈ సీజన్లో తాను ఐదు సెంచరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. అందులో మూడు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. మిడిల్‌సెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా తన కౌంటీ 10ఇన్నింగ్స్‌లలోనే ఐదు సెంచరీలు బాదాడు. మిడిల్‌సెక్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని ఎంచుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసేలా పుజారా అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పుజారా ససెక్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక కౌంటీల్లో ససెక్స్ తరఫున 118ఏళ్ల తర్వాత ఒకే సీజన్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ప్లేయర్‌గా చటేశ్వర్ పుజారా నిలిచాడు.
పుజారా, డూప్ కలిపి 219పరుగుల భాగస్వామ్యం
ఇక తొలి రోజు ఆట ముగిసేసరికి 10ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో పుజారా 115పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ జట్టు 4వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. ఇక ససెక్స్ తరఫున పుజారాతో పాటు మరో బ్యాటర్ టామ్ అల్సోప్ కూడా సెంచరీ (135) చేశాడు. పుజారా, డూప్ కలిసి 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో (200పరుగులు 368బంతుల్లో 19ఫోర్లు, 2సిక్సర్లు నాటౌట్) తన డబుల్ సెంచరీని కూడా పుజారా పూర్తి చేసుకున్నాడు. ఇక 155ఓవర్లకు ససెక్స్ 8వికెట్లు కోల్పోయి 490పరుగులు చేసింది.
లార్డ్స్‌లో తొలిసారి డబుల్ సెంచరీ
ఇక ఈ సీజన్లో వోర్సెస్టర్‌షైర్, మిడిల్‌సెక్స్‌లపై సెంచరీలు చేసిన పుజారా.. డెర్బీషైర్, డర్హామ్, మిడిల్ సెక్స్ మీద డబుల్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. ఇక తాజా డబుల్ సెంచరీతో పుజారా లార్డ్స్‌లో తన తొలి సెంచరీ, డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అతను రెండో వికెట్ తర్వాత బ్యాటింగ్‌కు దిగాడు. ఇక తన సహజ స్వభావానికి విరుద్ధంగా బౌలర్లపై దాడి చేస్తూ పుజారా బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతను 82 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. కట్, డ్రైవ్ షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. తద్వారా జట్టును పటిష్ట స్థితికి నడిపించాడు.

బౌలింగ్లో ఉమేష్ యాదవ్‌ను ఎదుర్కొంటూ..
ఇక పుజారా బ్యాటింగ్ చేస్తున్న టైంలో మిడిల్‌సెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పేస్ బౌలర్ అయిన భారత బౌలర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఆకట్టుకుంది. ఇక ఉమేష్ యాదవ్ తన బౌలింగ్లో 42పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక కౌంటీల్లో భారత ప్లేయర్లు ఇటీవల ఆడడానికి మొగ్గు చూపుతున్నారు. పుజారా, ఉమేష్ యాదవ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ లంకాషైర్ జట్టు తరఫున, నవదీప్ సైనీ కెంట్ తరపున ఆడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications