Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

7వ ఆటగాడు: 50వ టెస్టులో సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే

హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. పూజారికి ఇది 50వ టెస్టు. ఈ టెస్టులో పుజారా 164 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ సాధించాడు.

ఇది పుజారాకు 13వ టెస్టు సెంచరీ కాగా, శ్రీలంకపై మూడో సెంచరీ. తన కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న పుజారా ఈ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా యాభై టెస్టులో సెంచరీ సాధించిన ఏడో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మొత్తంగా చూస్తే 36 ఆటగాడిగా పుజారా నిలిచాడు.

Cheteshwar Pujara 7th Indian to celebrate 50th Test with a hundred

ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టులో 50వ టెస్టు మ్యాచ్‌ ఆడుతూ శతకం బాదిన క్రికెటర్లు ఆరుగురు మాత్రమే. 1961లో పాలి ఉమ్రిగర్ తొలిసారి 50వ టెస్టులో సెంచరీ సాధించగా 1979లో గుండప్ప విశ్వనాథ్, 1983లో కపిల్ దేవ్, 2004లో వీవీఎస్ లక్ష్మణ్, 2016లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే ఈ అరుదైన ఘనత అందుకున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి పుజారా చేరాడు. ఇక, ఈ టెస్టు ద్వారా నాలుగు వేల పరుగుల మైలురాయిని పుజారా అందుకున్నాడు. ఇన్నింగ్స్ 41.2వ ఓవర్లో దిల్రువన్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న పుజారా రెండు పరుగులు తీసి టెస్టుల్లో నాలుగు వేల పరుగులను పూర్తి చేశాడు.

50 టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు. అంతకు ముందు సునీల్‌ గవాస్కర్‌(4,947), రాహుల్‌ ద్రవిడ్‌(4,315), వీరేంద్ర సెహ్వాగ్‌(4,103) 50 టెస్టుల్లోనే 4వేలకు పైగా పరుగులు సాధించారు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+