గంభీర్ అలా: కోహ్లీ ఇలా చేసి ఉండాల్సింది కాదు (వీడియో)
హైదరాబాద్: కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 92 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుని కోహ్లీ.. భువీ లేదా కుల్దీప్‌తో పంచుకొని ఉంటే జూనియర్లకు మరింత ప్రోత్సాహకరంగా ఉండేదని కపిల్ అభిప్రాయపడ్డాడు.
తాజాగా కపిల్ మాటలకు మరికొందరు క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. భారత్ తరఫున వన్డేల్లో తొలి హ్యాట్రిక్ సాధించిన మాజీ క్రికెటర్ చేతన్ శర్మ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ కోహ్లీ తాను అందుకున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును హ్యాట్రిక్ సాధించిన కుల్దీప్ యాదవ్‌తో పంచుకోని ఉంటే బాగుండేదని అన్నాడు.

బౌలర్లు హ్యాట్రిక్‌లు దక్కించుకోవడం అనేది అత్యంత అరుదు
'కోహ్లీ పరుగులు చేయడం ఈ మధ్య సర్వసాధారణం అయింది. బౌలర్లు హ్యాట్రిక్‌లు దక్కించుకోవడం అనేది అత్యంత అరుదు. ఎప్పుడో 26 ఏళ్ల క్రితం అంటే 1991లో కపిల్ దేవ్ భారత్ తరఫున ఈ ఘనత అందుకున్నాడు. ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఆ ఘనత సాధించాడు' అని పేర్కొన్నాడు.

కుల్దీప్‌తో కలిసి పంచుకుంటే బాగుండేది
'కోహ్లీ తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కుల్దీప్‌తో కలిసి పంచుకుంటే బాగుండేది. 1987లో వరల్డ్ కప్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను హ్యాట్రిక్ సాధించాను. అదే మ్యాచులో సునీల్ గవాస్కర్ సెంచరీ సాధించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అతన్ని వరించింది. కానీ, గావస్కర్ ఆ అవార్డుని నాతో కలిసి షేర్ చేసుకున్నాడు' అని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
కోహ్లీతో పంచుకున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును పంచుకున్న గంభీర్
అంతేకాదు 2009లో గౌతమ్ గంభీర్ కూడా తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కోహ్లీతో పంచుకున్న సంగతిని చేతన్ శర్మ గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేయడం విశేషం. కోహ్లీ తొలి సెంచరీ నమోదు చేసిందుకు గాను గంభీర్ తన తన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కోహ్లీ ఇవ్వమని చెప్పాడు.
కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ మరచిపోలేనిది
కాగా, ఇటీవల కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో ఆటగాడిగా కుల్దీప్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ మరచిపోలేనిదని అతడి కోచ్ కపిల్ పాండే ప్రశంసలు కురిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications