న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వరల్డ్‌కప్ హ్యాట్రిక్ హీరోకి బర్త్‌డే విషెస్ వెల్లువ

Chetan Sharma Birthday Special: Lesser-Known Facts & Best Performances

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ అందుకున్న రికార్డుని నెలకొల్పిన టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ శర్మ శుక్రవారం 54వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

1983, డిసెంబరు 7న అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన చేతన్ శర్మ అనతికాలంలోనే అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. 11 ఏళ్ల తన కెరీర్‌లో 23 టెస్టులు, 65 వన్డేలు ఆడిన శర్మ మొత్తం 128 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ జట్టుని ఆదుకున్నాడు.

ఓ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ సాధించి జట్టు విజంయలో కీలకంగా వ్యవహారించాడు. ఇక, చేతన్ శర్మ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది మాత్రం 1987 వరల్డ్‌కప్‌లోనే. ఈ వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసి చరిత్ర సృ,ష్టించాడు.

వరుసగా మూడు బంతుల్లో కెన్ రూథర్‌ఫర్డ్, ఇయాన్ స్మిత్, ఎవెన్ చాట్‌ఫీల్డ్‌లను క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. 1994లో వెస్టిండీస్‌పై ఆఖరి మ్యాచ్ ఆడిన చేతన్ శర్మ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు.

Story first published: Friday, January 3, 2020, 17:16 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X