Chetan Sakariya: తమ్ముడి మరణం ఐపీఎల్ కాంట్రాక్ట్.. నాన్న చనిపోయాడు టీమిండియా పిలుపు!

Chetan Sakariya Tough Journey Before Debut TeamIndia Call-Up | Oneindia Telugu

చెన్నై: ఆ దేవుడు తనకు ఓ వైపు కష్టాలను ఇస్తూనే మరోవైపు సంతోష క్షణాలను అందిస్తున్నాడని రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా అన్నాడు. తమ్ముడు మరణించిన మరుసటి నెలలోనే ఐపీఎల్ బిగ్ కాంట్రాక్ట్ దక్కితే.. తన తండ్రి మరణం తర్వాత భారత జట్టు పిలుపు అందుకున్నానని తెలిపాడు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తన తండ్రి కలని, ఆయన ఇప్పుడుంటే సంతోషించేవాడని సకారియా చెప్పుకొచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా.. ఐపీఎల్ 2021 సీజన్‌ అర్థంతరంగా ఆగిపోయిన తర్వాత అతని తండ్రి కంజి భాయ్ కోవిడ్‌తో మరణించాడు.

ఇక వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. 20 మందితో కూడిన ఈ జట్టులో ఏకంగా ఐదుగురు కొత్త క్రికెటర్లు ఎంపికయ్యారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన సకారియాతో పాటు యువ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణాతో పాటు స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నారు.

నాన్న ఉంటే బాగుండేది..

నాన్న ఉంటే బాగుండేది..

ప్రస్తుతం చెన్నైలో ఎమ్‌ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తరఫున సాధన చేస్తున్న సకారియా.. టీమిండియా పిలుపుపై స్పందించాడు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల వల్లే ఇది సాధ్యమైందన్నాడు. ‘ఈ సంతోషకరమైన సమయంలో నాన్న ఉంటే బాగుండేది. నేను టీమిండియాకు ఆడాలని ఆయన కోరుకునేవాడు.

ఈ రోజు మా నాన్నను ఎంతో మిస్సవుతున్నా. ఈ ఏడాది కాలంలోనే ఆ దేవుడు నాకు కష్టాలతో పాటు సంతోషకర క్షణాలను అందించాడు. మా తమ్ముడు మరణించి మరుసటి నెలలోనే నాకు బిగ్ ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కింది. గత నెలలో మా నాన్న దూరమయ్యాడు. ఇప్పుడు టీమిండియా పిలుపు అందింది. మా నాన్నతో ఆసుపత్రిలో ఏడు రోజులున్నాను. ఆ బాధ వర్ణాతీతం. ఇదంతా నా దివంగత తండ్రి, మా అమ్మ వల్లే. వారే నా ఆటకు అడ్డు చెప్పలేదు.'అని సకారియా భావోద్వేగానికి గురయ్యాడు.

రూ. 1.20 లక్షలకు..

రూ. 1.20 లక్షలకు..

రూ.20 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2021 సీజన్ వేలంలోకి వచ్చిన చేతన్ సకారియాను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.20 లక్షలు భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన సకారియా స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వికెట్లను తీసి అందరి దృష్టి ఆకర్షించాడు.

8.22 ఎకానమీతో మొత్తం 7 వికెట్లు తీశాడు. ఐపీఎల్ తర్వాత జనాలు తన గురించి మాట్లాడుకుంటుంది విని భారత జట్టుకు కనీసం నెట్ బౌలర్‌గా అయినా సేవలందించే అవకాశం దక్కుతుందని భావించానని సకారియా చెప్పుకొచ్చాడు. కానీ ఏకంగా టీమిండియాకే ఆడే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

లంక వెళ్లే భారత జట్టు

లంక వెళ్లే భారత జట్టు

శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్ పాండ్యా, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్, మనీష్‌ పాండే, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చహల్‌, రాహుల్‌ చహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 11, 2021, 15:52 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X