న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవిశాస్త్రిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్న..

Chetan Chauhan calls for Ravi Shastri removal ahead of Australia tour, says he should continue commentating

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో 1-4తో టెస్టు సిరీస్‌ ఓటమికి టీమిండియా కోచ్‌ రవిశాస్త్రే బాధ్యుడని మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ ఆరోపించారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందే అతడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను 1-4తో భారత్‌ కోల్పోయిన నేపథ్యంలో చేతన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే కంటే ముందే శాస్త్రికి ఉద్వాసన పలకాలని అన్నాడు.

'ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌ బాధ్యతల నుంచి తొలగించాలి. శాస్త్రి అద్భుత క్రికెట్‌ వ్యాఖ్యాత. అతడిని ఆ పని చేసేందుకే అనుమతించాలి' అని సూచించారు. శాస్త్రి కోచ్‌గాకంటే వ్యాఖ్యాతగానే రాణిస్తాడని, అతని పని అతనిని చేసుకోనివ్వాలన్నాడు.

ఇంగ్లాండ్‌లో కోహ్లీసేన ఇంకా బాగా ఆడాల్సి ఉండేదని చేతన్‌ పేర్కొన్నారు. రెండు జట్లు బలాబలాల్లో సమానంగా ఉన్నా ఇంగ్లాండ్‌ టెయిలెండర్లను ఔట్‌ చేయడంలో టీమిండియా విఫలమైందన్నారు. భారత క్రికెట్‌ జట్లలో కోహ్లీసేన అత్యుత్తమం అన్న రవిశాస్త్రి మాటలను చేతన్‌ వ్యతిరేకించారు.

'దాన్ని నేను అంగీకరించను. 1980ల్లోని భారత జట్టే ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక జట్టు. ఆసియా కప్‌నకు ఎంపిక చేసిన జట్టు అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో సమతూకంగా ఉంది. వారి నుంచి మెరుగైన ఫలితాలన్ని ఆశిస్తున్నా' అని చేతన్‌ అన్నారు.

Story first published: Monday, September 17, 2018, 8:54 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X