చెన్నై: గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముంబై సిటీపై గెలుపొందాలని డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ పట్టుదలగా ఉన్నది. ముంబై సిటీ ఎఫ్ సి జట్టుపై తమ జట్టుకు అసాధారణమైన రికార్డు నెలకొని ఉన్నదని చెన్నైయిన్ ఎఫ్ సి హెడ్ కోచ్ మార్కొ మాట్టరాజీ తెలిపాడు. 2014 లీగ్ ప్రారంభంలో మినహా ఇప్పటివరకు ముంబై సిటీతో జరిగిన నాలుగు మ్యాచ్ లలో ముంబై సిటీపై తమ జట్టే విజయం సాధించిందన్నారు.
బుధవారం సాయంత్రం చెన్నైలో ముంబైతో జరిగే మ్యాచ్ లోనూ అదే చరిత్ర పునరావ్రుతం అవుతుందని తెలిపారు. ఈ మ్యాచ్ ఫలితం కోసం వేచి చూస్తున్నామని మీడియాకు తెలిపారు. ఉదాహరణకు గత ఏడాది ఫైనల్స్‌తో సహా ఎఫ్ సి గోవాపై దాని సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌ల్లోనూ సందర్శకుల జట్లే విజయం సాధించాయని గుర్తుచేశారు.
ఇంకా చెన్నైయిన్ రికార్డును ఏ జట్టు బద్దలు కొట్టలేదన్నారు. తకుముందు ఎఫ్ సి గోవాతో జరిగిన నాలుగు లీగ్ మ్యాచ్ ల్లోనూ ఓటమి పాలైన ఢిల్లీ డైనమోస్ ఈ ఏడాది జరిగిన గత మ్యాచ్‌లో 2 - 0 స్కోర్ తేడాతో గోవాపై ఢిల్లీ గెలుపొందిన సంగతి గుర్తుచేశాడు.

'ప్రతి ఏడాది ప్రతి అంశం మారుతుంది. ప్రతి ఐఎస్ఎల్ లీగ్ గత లీగ్ టోర్నీలతో విభిన్నం. అదే ఈ దఫా నన్ను భయపెడుతున్నది. ఈ ఏడాది పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్నది. మేం గోవా సొంతగడ్డపై ఆ జట్టును ఓడించాం. అదే ముంబైపై జరిగే మ్యాచ్ ఫలితంపై నన్ను భయపెడుతున్నది. వాస్తవంగా మా జట్టే గెలుస్తుంది' అని అన్నాడు. ఇప్పటివరకు జరిగిన ఆరు లీగ్ మ్యాచ్ ల్లో కేవలం తొమ్మిది పాయింట్లే సాధించి ఐదో స్థానంలో నిలిచింది. కానీ రెండు గోల్స్‌తో కూడిన విజయాన్ని సాధిస్తే ఆటోమేటిక్‌గా టాప్ ఫోర్ జాబితాలో చేరిపోతుందని మాట్టరాజీ జోస్యం చెప్పాడు.
అయినా గెలుపొందకపోయినా డ్రా సాధించినా సెమీస్ బెర్త్ సాధించగలమని తెలిపాడు. తొలి దశ పూర్తయ్యేసరికి ఒక మ్యాచ్‌లో విజయం గానీ, ఒక డ్రా గానీ నమోదుచేస్తే చాలన్నాడు. సారధి జాన్ ఆర్నె రైస్, అటాకర్ హన్స్ ముల్డర్ వంటి ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో ఉండటంతో తాము రెండు గోల్స్ తో కూడిన విజయాన్ని లెక్కచేయనవసరం లేదని, ఫ్లేఆఫ్ దశకు ఎలా చేరుకోవాలన్నదే తమ తపన అని మాట్టరాజీ చెప్పారు.
ముంబై సిటీ ఎఫ్ సి హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ మాట్లాడుతూ ముందుగా తనతో సహా తమ జట్టు అంతా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే గత రెండు సీజన్లకు.. ప్రస్తుత టోర్నీ భిన్నంగా సాగుతున్నదన్న విషయాన్ని మరిచిపోవద్దన్నాడు. డిఫెండింగ్ చాంపియన్లుగా ఒక టీంపై ఆడుతున్నప్పుడు అదే స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. చెన్నైయిన్ ఎఫ్ సితో తమ జట్టు పెర్పార్మెన్స్ చాలా పేలవమేనని అంగీకరించిన అలెగ్జాండ్రీ.. తమ జట్టు తాజాగా విజయమే అలవాటుగా చేసుకున్నదని, గత రికార్డులను తిరగ రాస్తామని వ్యాఖ్యానించాడు.
చెన్నైతో జరిగే మ్యాచ్ కు సారధి డియాగో ఫోర్లాన్ అందుబాటులో ఉంటాడన్నారు. 'ఆయన ఎప్పుడు ఆడినా మేం విజయం సాధిస్తున్నాం. ఆయన స్కోర్ చేయడంతోపాటు అసిస్టెన్స్ కూడా ఇస్తారు. ఆయన గురించి మా ప్రత్యర్థి జట్టుకు పూర్తిగా తెలుసు' అని చెప్పాడు. ఏడు మ్యాచ్ లలో 11 పాయింట్లు గెలుచుకున్న ముంబై సిటీ ఎఫ్ సి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.