
ఐపీఎల్-2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చెన్నై ఆడిన ఆరు మ్యాచుల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ సందర్భంగా రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేయడానికి సిద్ధమయ్యామన్నాడు. వికెట్ కొద్దిగా తడిగా కనిపించడంతో దాని ద్వారా బౌలింగ్లో పేస్‌ను, స్పిన్‌ను ఉపయోగించాలనుకుంటున్నామన్నాడు. మా టీంలో రెండు మార్పులు చేసినట్లు చెప్పాడు. మోయిన్ అలీ, జోర్డాన్ లను తప్పించి వారి స్థానాల్లో ప్రిటోరియస్, సాంట్నర్‌లను తీసుకున్నామని చెప్పాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ..

పిచ్ మునుపటితో పోలిస్తే మారినట్లు కన్పిస్తోందన్నాడు. గత 3, 4 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయని, ఇది తమకు అడ్వంటేజ్ కావొచ్చని పేర్కొన్నాడు. మొత్తం జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. తొలిసారిగా ప్లేయర్ మెరెడిత్ ముంబై తరపున అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకీన్ కూడా అరంగేట్రం చేస్తున్నాడు. డేనియల్ సామ్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు.
ఇరు తుది జట్లు ఇవే
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (w), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని (w), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి