Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1982లో ఓటమి భయంతో భారత్ కూడా సరిగ్గా అలానే చేసింది

 Chennai Test in 1982 is closest Sri Lanka have come to winning in India, says Duleep Mendis

హైదరాబాద్: భారత గడ్డపై 1982లో తాము ఆడిన తొలి టెస్టులో తృటిలో విజయాన్ని చేజార్చుకున్నామని శ్రీలంక మాజీ ఆటగాడు దులీప్‌ మెండీస్‌ అన్నాడు. ప్రస్తుతం శ్రీలంక మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా కోల్ కతా వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా... నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో శ్రీలంకకు అతిపెద్ద భారీ ఓటముల్లో ఇదొకటి.

అయితే కోల్‌కతా వేదికగా ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడంలో ఆ జట్టు ఆటగాడు నిరోషాన్ డిక్వెల్లా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా టెస్టులో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్ వేసిన షమి బౌలింగ్‌లో పదేపదే బంతికి బంతికి మధ్య టైమ్ తీసుకుంటుండటంతో అతనికి కోపమొచ్చింది.

దీంతో క్రీజులో ఉన్న డిక్‌వెల్లాపై షమీ ఆగ్రహం వ్యక్తంచేశాడు. అతని దగ్గరికి వెళ్లి ఏదో మాటన్నాడు. ఆ తర్వాతి బంతికి డిక్‌వెలా మళ్లీ అలాగే చేయడంతో ఈసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ నేరుగా అంపైర్ దగ్గరికి వెళ్లి అతనిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరు అంపైర్లు కలిసి ప్లేయర్స్‌ను శాంతింపజేసిన సంగతి తెలిసిందే.

సరిగ్గా ఇలాంటి సంఘటనే 1982లో చెన్నైలో జరిగిన టెస్టులో చోటు చేసుకుందని శ్రీలంక మాజీ ఆటగాడు దులీప్‌ మెండీస్‌ తెలిపాడు. '1982లో తొలిసారి లంక భారత గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చింది. తొలి టెస్టు చెన్నైలో జరిగింది. ఆ టెస్టు డ్రాగా ముగిసింది. ఈ టెస్టులో భారత్ డ్రా కోసం ప్రయత్నించింది' అని చెప్పాడు.

'నిజానికి మేము గెలవాల్సిన టెస్టులో భారత్‌ డ్రా కోసం చాలా కష్టపడింది. మా బౌలర్‌ మెల్‌ ధాటికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా వికెట్లు కోల్పోయింది. అప్పుడు టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్‌ ఓడిపోకుండా ఉండాలని భావించి విజయం కోసం ప్రయత్నించకుండా డ్రా కోసం ఆడారు. దీంతో చివరకు ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది' అని మెండిస్ తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 29, 2017, 11:54 [IST]
Other articles published on Nov 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+