Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌: నిరాశ పర్చిన యువీ, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై(ఫోటోలు)

చెన్నై: ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపుతో ఆరంభించింది. చెన్నైలోని ఎమ్ చిదంబరం స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై ఒక్క పరుగుతో ఉత్కంఠ విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఆనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు గాను 149 పరుగులు చేశారు. ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు.

కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్‌ సింగ్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. 15వ ఓవర్లో బ్రావో సంధించిన షార్ట్‌లెంగ్త్‌ బంతిని పుల్‌చేయబోయి మిడ్‌ వికెట్‌లో ఈశ్వర్‌ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఇక ఎన్నో ఆశలున్న కెప్టెన్‌ జేపీ డుమినీ (5)ని ఈశ్వర్‌ బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్ వైపు మళ్లింది. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన మెర్నీ మోర్కెల్‌ అర్ధశతకం పూర్తి చేశాడు. అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టును అశ్విన్‌ సహకారంతో కెప్టెన్‌ ధోనీ ముందుకు నడిపించాడు.

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

చెన్నైపై చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో మోర్కెల్ కొట్టిన బంతి బౌండరీకి ఈవల పడి నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి. తీవ్రమైన ఉత్కంఠ మధ్య చైన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

మోర్కెల్ ఒంటరి పోరు చేసి, ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేసినా దురదృష్టం వెంటాడింది. అతను 55 బంతుల్లో 73 పరుగులు చేశాడు.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ ధోనితో కరచాలనం చేస్తున్న యువరాజ్ సింగ్.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్‌ సింగ్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. 15వ ఓవర్లో బ్రావో సంధించిన షార్ట్‌లెంగ్త్‌ బంతిని పుల్‌చేయబోయి మిడ్‌ వికెట్‌లో ఈశ్వర్‌ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

యువరాజ్ సింగ్‌ను పెవిలియన్‌కు పంపిన ఆనందంలో డారెన్ బ్రావో. 15వ ఓవర్లో బ్రావో సంధించిన షార్ట్‌లెంగ్త్‌ బంతిని పుల్‌చేయబోయి మిడ్‌ వికెట్‌లో ఈశ్వర్‌ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

ఇక ఎన్నో ఆశలున్న కెప్టెన్‌ జేపీ డుమినీ (5)ని ఈశ్వర్‌ బౌల్డ్‌ చేయడంతో మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్ వైపు మళ్లింది. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన మెర్నీ మోర్కెల్‌ అర్ధశతకం పూర్తి చేశాడు.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను పెవిలియన్‌కు పంపిన చెన్నై బౌలర్ ఆశిష్ నెహ్రాకు అభినందనలు తెలుపుతున్న జట్టు సహచరులు.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టును అశ్విన్‌ సహకారంతో కెప్టెన్‌ ధోనీ ముందుకు నడిపించాడు.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

చెన్నైలోని ఎమ్ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా ఛీర్ లీడర్స్ నృత్య ప్రదర్శన.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

ఎమ్ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా మొబైల్ ఫోన్‌లో విజయదరహాసాన్ని ప్రదర్శిస్తున్న చెన్నై మద్దతుదారులు.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన ట్వంటీ20 మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మెక్‌కుల్లం కేవలం నాలుగు పరుగులు చేసి కౌల్టర్ నీలే బౌలింగులో యువరాజ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.

 నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

నిరాశ పర్చిన యువరాజ్, ఒక్క పరుగుతో బోణీ చేసిన చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతూ వచ్చిన డ్వైన్ స్మిత్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇమ్రాన్ తాహీర్ బౌలింగులో అవుటయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ వేగంగా పరుగులు చేసే క్రమంలో వికెట్లను కోల్పోతూ వచ్చింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+