For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జోస్యం చెప్పారు.. 2018 కప్ సన్‌రైజర్స్‌దేనట

Chennai Super Kings vs Sunrisers Hyderabad IPL Final 2018: Why Kane Williamson-led SRH might win IPL title?

హైదరాబాద్: రెండు నెలలపాటు క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ తుది సమరానికి భారీ అంచనాలతో వాంఖడే స్టేడియం ముస్తాబైంది. ఈ క్రమంలో ఫైనల్లో సన్‌రైజర్స్ ధోనీ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది. 2018 సీజన్లో మూడుసార్లు చెన్నైతో తలపడినప్పటికీ.. హైదరాబాద్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. నాలుగో మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీ నెగ్గాలని విలియమ్‌సన్ సేన పట్టుదలతో ఉంది.

మరోవైపు రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సూపర్ కింగ్స్.. కప్ గెలిచి ధోనీకి బహుమతిగా ఇవ్వాలని భావిస్తోంది. గణాంకాలు ఎలా ఉన్నా పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్‌కే కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. భువీ, కౌల్, రషీద్ ఖాన్, షకీబుల్ హసన్, సందీప్ శర్మలతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. వాంఖడే పిచ్ స్పిన్‌కు అనుకూలించే వీలుంది.

సన్‌రైజర్స్ బౌలర్లు చెన్నై‌ను 180 పరుగుల్లోపు కట్టడి చేస్తే విలియమ్సన్, ధావన్‌తో కూడిన బ్యాటింగ్ విభాగం మిగతా పని చూసుకుంటుంది. ఇదే వేదికగా 150 కంటే తక్కువ స్కోరు చేసినప్పటికీ ఈ సీజన్లో సన్‌రైజర్స్ మూడుసార్లు గెలుపొందింది. మే 24న ముంబైపై 118 పరుగుల స్కోరును కూడా కాపాడుకొని విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించకపోయినా.. బౌలర్లు రాణిస్తుండటం హైదరాబాద్‌కి కలిసొచ్చే అంశం.

జ్యోతిష్యం గురూ:
జ్యోతిష్కులు కూడా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌దే విజయమని చెబుతున్నారు. కోహ్లి కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని గతంలో చెప్పిన ఆస్ట్రాలజర్ గ్రీన్‌స్టోన్ లోబో.. ఈసారి సన్‌రైజర్స్‌ గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ప్లూటో 260 ఏళ్ల తర్వాత తిరిగి సొంత రాశిలోకి ప్రవేశిస్తోందట. అలా జరగడంతో కేన్ విలియమ్సన్‌కు బాగా అనుకూలిస్తుందని లోబో చెబుతున్నాడు. గురుడు, ఇతర గ్రహాలు కూడా అతడికి అనుకూలంగా ఉన్నాయట. చెన్నై పైచేయి సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ.. సన్‌రైజర్స్ కప్ గెలుస్తుందని ఆయన అంచనా వేశాడు.

Story first published: Sunday, May 27, 2018, 17:23 [IST]
Other articles published on May 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+