Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్: విలువ రూ.5 లక్షలేనట..!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంజైజీ మరో కొత్త వివాదాన్ని ఎదుర్కొంటుంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనవాసన్‌ ఆధ్వర్యంలోని ఇండియా సిమెంట్స్‌కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సంవత్సరం రూ. 5 లక్షలుగా ప్రాంచైజీ చూపించింది.

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ జట్టు విలువ రూ. 450 కోట్లు ఉండగా, ఈ ఏడాది జట్టు విలువ రూ. 5 లక్షలేనని ఫ్రాంజైజీ ప్రకటించింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంజైజీ తీరుని తప్పబట్టినట్లు తెలుస్తోంది.

 Chennai Super Kings valued at just Rs 5 lakh only by owners

కేవలం ఒక్క సంవత్సరంలోనే జట్టు విలువ ఇంతగా లా పడిపోతుందంటూ ఫ్రాంఛైజీని ప్రశ్నించింది. అంతే కాదు జట్టు విలువను సరిగా చూపించపోతే, ఫ్రాంజైజీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చిరించింది. ఐపీఎల్‌లో చెన్నై జట్టు తరుపున ధోని, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెక్ కల్లమ్, మైఖెల్ హస్సీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ఛాంపియన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రెండు సార్లు గెలిచింది.

ఇది ఇలా ఉంటే, బీసీసీఐ రూల్స్ ప్రకారం ఫ్రాంజైజీ అమ్మకపు ధరలో 5 శాతం బీసీసీఐకి చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విలువ రూ. 5 లక్షలుంటే, బీసీసీఐకి చెన్నై ఫ్రాంచైజీ చెల్లించింది కేవలం రూ. 25,000వేలేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరికొందరైతే మరో అడుగు ముందుకేసి, చెన్నై సూపర్ కింగ్స్ విలువ రూ. 5 లక్షలే అయితే, మేము కొనుగోలు చేస్తామంటే, మేము కోనుగోలు చేస్తామంటూ సోషల్ మీడియా వెబ్‌సైట్లైన ఫేస్‌బుక్ ట్విట్టర్‌లో ట్వీట్స్ హాల్ చేస్తున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+