చెన్నై సూపర్ కింగ్స్ జోరుకు తలవంచిన రాజస్థాన్ రాయల్స్

లక్ష్యఛేదనలో చెన్నైకి శుభారంభం లభించలేదు.విజయ్ (5) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. దీంతో నిలదొక్కుకునే వరకు నెమ్మదిగా ఆడారు హసి, రైనా. 10 ఓవర్లకు చెన్నై 73/1తో ఉన్నపుడు రాజస్థాన్ పోటీలోనే ఉన్నట్లనిపించింది. ఐతే నయన్ దోషి వేసిన 11వ ఓవర్లో 19 పరుగులు రాబట్టిన హసి, రైనా రాయల్స్ ఆశలకు గండికొట్టారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 137 పరుగులు జోడించి, చెన్నైని గెలిపించారు.
అంతకుముందు ఓపెనర్లు రాహుల్ ద్రవిడ్, షేన్ వాట్సన్‌లు టోర్నీలోనే రాజస్థాన్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం (86) అందించినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 47/0. తర్వాత ద్రవిడ్ జోరు మొదలైంది. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని ద్రవిడ్ రెచ్చిపోయాడు. అతను కొట్టిన 10 బౌండరీల్లో ఎనిమిది స్పిన్నర్ల బౌలింగ్‌లో వచ్చినవే. పది ఓవర్ల తర్వాత పరిస్థితి మారిపోయింది. జకాతి (2/22) 11వ ఓవర్లో వాట్సన్‌ను చక్కటి రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చి, వికెట్ల పతనానికి తెరతీశాడు. ఆ తర్వాత మెనారియా (2), బోథా (8), ద్రవిడ్‌లు పేలవ షాట్లు ఆడి పెవిలియన్ చేరారు. 6 ఓవర్ల వ్యవధిలో 4 వికెట్లు పడటంతో స్కోరు వేగం పడిపోయింది. ఇదే అదనుగా చెన్నై బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications