Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

Rajasthan Royals
జైపూర్: రాజస్థాన్ రాయల్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన చెన్నై సోమవారం 63 పరుగుల తేడాతో రాయల్స్‌ను చిత్తు చేసింది. మైక్‌ హసి (46; 30 బంతుల్లో 8X4), మురళీ విజయ్‌ (53; 40 బంతుల్లో 2X4, 3X6)ల అద్భుత ఆరంభానికి సురేశ్‌ రైనా (43; 27 బంతుల్లో 6X4), మహేంద్రసింగ్‌ ధోనీ (41 నాటౌట్‌; 19 బంతుల్లో 3X4, 3X6)ల మెరుపులు తోడవడంతో మొదట చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం రాజస్థాన్‌ను 19.3 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌట్‌ చేసింది. బొలింజర్‌ (3/22), అశ్విన్‌ (2/24) రాయల్స్‌ పతనంలో కీలకపాత్ర పోషించారు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఆజింక్య రహానె (52; 36 బంతుల్లో 7X4) ఒక్కడే రాణించాడు. విజయ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ఆరు ఓవర్లకే ఓపెనర్లు ద్రవిడ్‌ (20), వాట్సన్‌ (11)లు పెవిలియన్‌ చేరారు. ఎనిమిదో ఓవర్లో రాస్‌ టేలర్‌ (6) వెనుదిరగడంతో రాజస్థాన్‌ ఓటమి ఖరారైంది. అప్పటికి స్కోరు 63 పరుగులే. తర్వాత రహానె చూడముచ్చటైన షాట్లు ఆడాడు. ఐతే అతని అర్ధశతకం అభిమానుల్ని అలరించడానికి మాత్రమే ఉపయోగపడింది. చివరి ఐదు వికెట్లను రాజస్థాన్‌ 5 పరుగుల తేడాతో కోల్పోయింది.

అంతకు ముందు చెన్నైకి మెరుపు ఆరంభం లభించింది. ఆ ఊపు ఇన్నింగ్స్‌ ఆసాంతం కొనసాగింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లో ఏ ఒక్కరో బాగా ఆడారని చెప్పలేం. ఆడిన నలుగురూ సమష్టిగా వీరబాదుడు బాది చెన్నైకి భారీ స్కోరునందించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+